వారు ఇద్ద‌రూ ఫేస్ బుక్ ద్వారా ప‌రిచ‌యం చేసుకుని కొద్ది రోజులు ప్రేమ వ్య‌వ‌హారం కొన‌సాగించారు. ఆ త‌రువాత పెళ్లి చేసుకుంటాను అని ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి రూ.కోటీ వ‌ర‌కు వ‌సూలు చేసిన కిలాడి దంప‌తుల‌ను ఎట్ల‌కేల‌కు పోలీసులు అరెస్ట్ చేసారు. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు గుంటూరు జిల్లాకు  చెందిన ఎర్ర‌గుడ్ల దాస్‌, జ్యోతిలు క‌ళ్యాణి శ్రీ పేరుతో ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయ్యారు.

దాదాపు ఏడాదిన్న‌ర కాలం పాటు ప్రేమాయం కూడా న‌డిపారు. వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మ‌బ‌లికారు. ఆ త‌రువాత చే బ‌దులు, ఇత‌ర ఖ‌ర్చులు ఉన్నాయంటూ ద‌శ‌ల వారిగా దాదాపు కోటి రూపాయ‌ల వ‌ర‌కు కాజేసారు.  తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన సాప్ట్‌వేర్ ఇంజినీర్  ఇదివ‌ర‌కే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదు మేర‌కు ఇన్‌స్పెక్ట‌ర్ జి.వెంక‌ట్రామిరెడ్డి గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లికి వెళ్లి నిందితుల‌ను గుర్తించి ప‌ట్టుకొని హైద‌రాబాద్‌కు తీసుకొచ్చారు.  కోర్టులో మంగ‌ళ‌వారం హాజ‌రు ప‌రిచి, జైలుకు త‌ర‌లించారు.

అయితే దాదాపు 40 ఏండ్ల వ‌ర‌కు వ‌య‌స్సు ఉన్న ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు పెళ్లి కాక‌పోవ‌డంతో సంవ‌త్స‌రంన్న‌ర కింద‌ట య‌ర్ర‌గ‌డ్డ దాస్ క‌ల్యాణి పేరుతో ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయ్యాడు. తాము విజ‌య‌వాడ‌లో ఉంటున్నామ‌ని, సాంప్ర‌దాయ కుటుంబం అని చెప్పాడు. కొద్ది రోజుల త‌రువాత ఉన్న‌ట్టుండి తాను నిన్ను ప్రేమిస్తున్నాన‌ని న‌మ్మ‌బ‌లికి పెళ్లి కూడా చేసుకుంటాన‌ని చెప్పాడు. ఆ త‌రువాత డ‌బ్బులు కాజేసిన త‌రువాత ఫోన్ చేయొద్ద‌ని, విజ‌య‌వాడ‌కు రావొద్ద‌ని ఒక ష‌ర‌త్ కూడా విధించాడు. ఇదంతా నిజ‌మేన‌ని భావించిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ దాస్‌ను నిజంగానే క‌ళ్యాణి అనుకున్నాడు.

ఈ స‌మయంలోనే పెళ్లి ప్ర‌స్తావ‌న కూడ వ‌చ్చింది. ఒక్క‌సారి క‌లుద్దాం అని కోర‌గా, పెళ్లి సంబంధం మ‌ధుసూద‌న్ అనే వ్య‌క్తితో మాట్లాడాల‌ని ఒక మొబైల్ నెంబ‌ర్ కూడా ఇచ్చాడు. దాస్ మ‌ధుసూద‌న్‌లా కూడా న‌టించాడు. త‌మ‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు, ఖ‌ర్చులు త‌దిత‌ర అని న‌మ్మబ‌లికి జూన్ 2020 నుంచి అక్టోబ‌ర్ 2021 వ‌ర‌కు దాదాపు రూ.కోటి తీసుకొని మోసం చేశాడు. వివాహం పేరుతో మోసం చేసిన దాస్ నూజివీడ్‌లో ఐఐఐటీ విద్యార్థి.  ఆన్‌లైన్ ర‌మ్మీ ఆడతుండ‌డ‌మే అత‌ని ప‌ని.. అదేవిధంగా ఓ సాప్ట్‌వేర్ సంస్థ‌లో కూడా ప‌ని చేసాడు. అయితే అత‌ను ఆన్‌లైన్ ర‌మ్మీ ఆడి విధుల‌ను మ‌ర‌చిపోవ‌డంతో ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొల‌గించింది. ఇలా ప‌లు బెట్టింగ్‌లు.. మోసాల‌కు పాల్ప‌డడమే  అత‌ని వృత్తి కొన‌సాగిస్తున్నాడు.  

   


మరింత సమాచారం తెలుసుకోండి: