మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ట్టాలు తీసుకొచ్చినా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ముఖ్యంగా త‌ల్లి, చెల్లి, కూతురు అని వావివ‌ర‌స‌లు మ‌రిచిపోయి కామాంధులు త‌న కోరిక తీర‌డ‌మే ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు దేశ‌వ్యాప్తంగా  నిత్యం చోటు చేసుకూనే ఉంటున్నాయి. తాజాగా తండ్రిని న‌రికి చంపిన కేసులో ఓ యువ‌తి, ఆమె ముగ్గురు మైన‌ర్ స్నేహితుల‌ను బెంగ‌ళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

య‌ల‌హంక న్యూటౌన్ పోలీసులు వెల్ల‌డించిన‌ వివ‌రాల ప్ర‌కారం.. బీహార్‌కు చెందిన 45 ఏండ్ల దీప‌క్ న‌గ‌రంలోని జీకేవీకే క్యాంప‌స్‌లో సెక్యూరిటీ గార్డుగా  విధులు నిర్వ‌హిస్తున్నాడు. అత‌నికి భార్య‌తో పాటు ఇద్ద‌రు కూతుర్లు క‌ల‌రు. పెద్ద కుమార్తె  ఓ ప్ర‌యివేటు చ‌దువుతుంది. మ‌రొక‌రు 4వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. అయితే దీప‌క్ త‌న పెద్ద కుమార్తెను లైంగికంగా ప‌లుమార్లు వేధించాడు. అయితే ఈ విష‌యంపై ఇప్ప‌టికే భార్య‌భ‌ర్త‌లు కూడా గొడ‌వ‌ప‌డ్డారు.

సోమ‌వారం మ‌ద్యం మ‌త్తులో ఈ విష‌యంపై ఇంట్లో వారితో గొడ‌వ‌కు దిగాడు. దీంతో విసుగు చెందిన మొద‌టి కుమార్తె త‌న స్నేహితుల‌కు ఫోన్ చేసింది. ఇంటికి వ‌చ్చిన ఆ అమ్మాయి, స్నేహితులు క‌లిసి దీప‌క్‌ను హ‌త్య చేసారని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు దీప‌క్‌కు ఇద్ద‌రు భార్య‌లు ఉన్నార‌ని, మొద‌టి భార్య బీహార్‌లో ఉంటుంద‌ని, రెండ‌వ భార్య స్వ‌స్థ‌లం క‌ర్నాట‌క‌. దీప‌క్ కుమార్తె తండ్రి ప‌లుమార్లు లైంగికంగా వేధించాడ‌ని ఆరోపిస్తుంది. అయితే లైంగిక వేధింపులే అత‌ని మృతికి కార‌ణ‌మా..?  లేక వేరే కార‌ణంతో దీప‌క్‌ను హ‌త్య చేశారా అనే కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన తండ్రి కూతురుపై లైంగిక వేధింపులు చేయ‌డం ఏమిట‌ని అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. ఈ క‌ళియుగ కాలంలో మ‌ద్యం మ‌త్తులో వావివ‌రుస‌లను మ‌రిచిపోయి విచ‌క్ష‌ణ ర‌హితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇది దేశ‌వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న‌లు త‌రుచూ ఏదో ఒక చోట నిత్యం చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్ర‌భుత్వాలు వాటిని అరిక‌ట్టేందుకు ఎంత ప్ర‌య‌త్నం చేసినా కానీ ఆ కామాంధుల తీరు మాత్రం మార‌డం లేదు. భార‌త‌దేశంలో శిక్ష‌లు వెంట‌నే అమ‌లు చేయ‌క‌పోవ‌డం ద్వారానే ఇలాంటి ఘాతుకాల‌కు పాల్ప‌డుతుంటార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: