ప్ర‌ముఖ సింగ‌ర్ హ‌రిణి తండ్రి ఏకేరావు అక‌స్మాత్తుగా అనుమాన‌స్ప‌దంగా మృతి చెందారు.  ఏకేరావు మృత‌దేహాన్ని బెంగ‌ళూరు రైల్వే ట్రాక్ పై  పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అత‌ని కుటుంబ స‌భ్యుల ఫోన్‌లు ప‌ని చేయ‌డం లేదు అని పోలీసులు పేర్కొంటున్నారు. దాదాపు గ‌త వారం రోజుల నుంచి హ‌రిణి కుటుంబ స‌భ్యులు అదృశ్యం అయ్యారు. శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటారు వీరు. హైద‌రాబాద్ కు చెందిన టాలీవుడ్ సింగ‌ర్ ఆయ‌ల సోమ‌యాజుల హ‌రిణీ ఇంట్లో ఓ మిస్ట‌రీ క‌నిపిస్తున్న‌ది. వారం రోజుల నుంచి కుటుంబం అంతా అదృశ్య‌మై.. హల్‌చల్ అవుతున్న త‌రుణంలో ఇప్పటికిప్పుడు మరో వార్త తెర మీద‌కు వ‌చ్చింది.  సింగ‌ర్ తండ్రి ఏకే రావు బెంగళూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శవంగా కనిపించడంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

 ఇప్పటి వరకూ ఆచూకి లేకుండా పోయిన  ఫ్యామిలీ ఇప్పుడు బెంగళూరు రైల్వే పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వీరే వెళ్లిపోయారా లేక ఏమైనా జ‌రిగిందా..? అస‌లు ఏకేరావుది సూసైడా, మర్డరా?  అన్న‌ది తేలాల్సి ఉన్న‌ది. ఒకవేళ  సూసైడ్‌ అయితే ఇన్నాళ్లూ హరిణి కుటుంబం ఏమైపోయింద‌ని.. మర్డర్ అయితే ఎవరు ఈ హత్యకు పాల్పడ్డార‌ని ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  మ‌రొక విష‌యం  ఏమిటంటే.. మృతి చెందిన  ఏకే రావు సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్‌కు సీఈఓగా ఉండ‌డం గ‌మ‌నార్హం.  సింగర్‌ హరిణిరావు తండ్రి ఏకేరావు మృతి కేసులో సంచలన విషయాలు వెల్ల‌డ‌వుతున్నాయి.  ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తున్న‌ది. ఏకేరావు సూసైడ్‌ నోట్‌ లభించడంతో  పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 ఓ బడా వ్యక్తి మోసం చేసాడని కోరమంగళం పోలీస్టేషన్‌కు లేఖ రాసారు ఏకేరావు.  ఏకేరావు మృతదేహం  వ‌ద్ద మాత్రం కత్తి లభించడంతో.. ఆయనే చేయి, మెడ కోసుకున్నాడని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక‌లో కూడా అదే విషయం వెల్లడి అయిన‌ది. సుబదగుంట పోలీస్టేషన్‌లో ఏకేరావుపై మూడు రోజుల క్రితం 420 కేసున‌మోదు అయిన‌ది.  తనకు జరిగిన మోసంపై నాలుగు రోజులుగా తన కుటుంబ సభ్యులతో ఏకేరావు చర్చించినట్టు వెల్ల‌డ‌వుతోంది.  అన్యాయంగా  తనపై కేసు పెట్టారని   ఏకేరావు వాపోయారు.  న‌వంబ‌ర్‌ 22న ఉదయం ఇంట్లో కత్తి తీసుకుని వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు.  కోరమంగళం పోలీస్టేషన్‌కు అందిన లేఖ ఆధారంగా పోలీసులు ఏకేరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: