పెట్రోల్ బంకుల మోసాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ధనార్జనే ధ్యేయంగా పెట్రోల్ బంకు నిర్వాహకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. పంపింగ్ మీటర్ రీడింగ్ లో చేతివాటం చూపడం దగ్గర్నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి మరీ మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను నిండా ముంచుతున్నారు. పెట్రోల్ బంకుల నిర్వాహకులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరీ నయా వంచన కు తెరతీశారు. అనుభవజ్ఞులు కూడా గుర్తించడానికి వీలు లేకుండా ఏకంగా నకిలీ చిప్పులను ఏర్పాటు చేసుకొని  మోసాలకు పాల్పడుతున్నారు. అయితే పెట్రోల్ బంకు మోసాలకు ఆయిల్ కంపెనీలు అవలంభిస్తున్న విధానాలు కూడా కారణమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. బంకులకు ఫీల్లింగ్ మిషన్లను ఆయిల్ కంపెనీలు సమకూరుస్తాయి. చాలావరకు ఆయిల్ కంపెనీలు బంకు నిర్వాహకులతో కుమ్మక్కై నామమాత్రపు మిషిన్స్ ని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఫీలింగ్ కేంద్రంలో మార్పుచేర్పులతో పాటు రిమోట్ ద్వారా ఆపరేషన్ కు వెసులుబాటు కల్పిస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న యాజమాన్యాలు పెట్రోల్,డీజిల్ పంపింగ్, రీడింగ్ లో జంపింగ్ లకు పాల్పడుతూ వినియోగదారులను నిలువునా  ముంచేస్తున్నారు. ప్రతి ఫీల్లింగ్ మిషన్ లోనూ పెట్రోల్ రీడింగ్ సెట్ చేసే సాఫ్ట్ వేర్ చిప్ ఉంటుంది. అయితే అసలు చిప్ కు బదులు నకిలీ చిప్ ను తమకు అనుకూలంగా సెట్ చేసుకొని బంకుల నిర్వాహకులు ఫీలింగ్ మిషన్లు అమరుస్తారు. దీనికి చిన్న బ్యాటరీ పెట్టి కారు రిమోట్ సైజ్ కలిగి ఉన్న రిమోట్ తో అనుసంధానం చేస్తారు. ఇందులో లీటర్ పెట్రోల్ పోయించుకుంటే 800  మి.లీ. పడగానే లీటర్ రీడింగ్ చూపెటట్టు అడ్జస్ట్ చేస్తారు. అంటే పైన రీడింగ్ కరెక్ట్ గానే ఉన్నా, ట్యాంక్ లో పడే పెట్రోల్ మాత్రం తక్కువ. ఎవరికి అనుమానం రాదు, ఈ విధంగా వినియోగదారులను నిట్టనిలువునా దోచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: