తెలంగాణ‌లోని వ‌న‌ప‌ర్తి జిల్లాలో కీచ‌క ఎస్ఐ బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు అయింది. ఓ వివాహిత‌ను లొంగ‌దీసుకుని ఆమెతో అక్ర‌మ సంబంధం న‌డుపుతున్నాడు ఎస్సై. అది గ‌మ‌నించిన ఆమె భ‌ర్త ఎస్ఐని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకొని చిత‌క‌బాదాడు. వివ‌రాల్లోకి వెళ్లితే.. వ‌న‌ప‌ర్తి రూర‌ల్ ఎస్ఐగా విధులు నిర్వ‌హిస్తున్న షేక్ ష‌ఫీ కొంత‌కాలంగా కొత్త‌కోట‌కు చెందిన ఓ వివాహిత‌తో అక్ర‌మ‌సంబంధం న‌డుపుతున్నాడు. త‌రుచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ.. భ‌ర్త లేని స‌మ‌యంలో ఇంటికి వెళ్లి రాస‌లీల‌లు కొన‌సాగిస్తూ ఉన్నాడు.

స్నేహితులు, స్థానికుల సాయంతో ఈ విష‌యం తెలుసుకొని భ‌ర్త వీరిద్ద‌రినీ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నాడు.  ఈనెల 18న బ‌య‌టికి వెళ్తున్న‌ట్టు భార్య‌కు చెప్పి వెళ్లాడు. కానీ స‌మీపంలోనే కాపు కాసి ఉన్నాడు. భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్ల‌గానే ఆ మ‌హిళ ఎస్ఐకి ఫోన్ చేసింది. ఫోన్ చేయ‌గానే అత‌ను క్ష‌ణాల్లోనే ఇంటి ముందు వాలిపోయాడు. వారు ఇద్ద‌రూ క‌లిసి రాస‌లీల‌ల్లో మునుగుతుండ‌గానే స్నేహితుల సహాయంతో భ‌ర్త వారిని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. దీంతో కోపంతో రగిలిపోయిన భ‌ర్త స్నేహితుల‌తో క‌లిసి ఎస్ఐని విచ‌క్ష‌ణ ర‌హితంగా చిత‌క‌బాదాడు.

ఎస్ఐని చిత‌క‌బాదుతుండ‌గా అడ్డు వ‌చ్చిన భార్య‌ను కూడా చావ‌బాదాడు. త‌న‌ను వ‌దిలివేయాల‌ని ఎస్ఐ ప్రాధేయ‌ప‌డాల‌ని వారంద‌రూ క‌లిసి చిత‌క‌బాద‌డంతో అత‌డు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ విష‌యంపై స్థానిక పోలీసులు స‌మాచారం తెలుసుకుని హుటాహుటిన అక్క‌డికి చేరుకున్నారు.  తీవ్రంగా గాయ‌ప‌డిన  ఎస్ఐని కాపాడి వ‌న‌ప‌ర్తిలో ఉన్న‌టువంటి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు మెరుగైన వైద్యం కోసం అత‌డిని హైద‌రాబాద్ న‌గ‌రానికి త‌ర‌లించారు. అయితే ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న పోలీస్ ఉన్న‌తాధికారులు ఎస్సై ష‌ఫీని స‌స్పెండ్ చేస్తూ  ఇవాళ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసారు.  వివాహిత మ‌హిళ ప‌ట్ల వ‌క్ర బుద్ధి చూపించి లోబ‌రుచుకుని వారి కాపురంలో నిప్పులు పోసిన ఎస్ఐకి త‌గిన శాస్త్రి జ‌రిగింద‌ని స్థానికులు హ‌ర్శం వ్య‌క్తం చేస్తున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: