కొన్ని కొన్ని సార్లు జరిగే ఊహించని ఘటనలు ఏకంగా పోలీసులకు షాక్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పోలీసులు ఒకచోట తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అటువైపుగా వచ్చిన ప్రతి వాహనాన్ని కూడా ఆపుతూ చెక్ చేస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చింది. అయితే ఆ కారు పోలీసులు తనిఖీలు చేస్తున్న దగ్గరికి వెళ్లకుండా కొంత దూరంలోనే ఆగిపోయింది. అయితే తనిఖీలు చేస్తున్న పోలీసులు కొంత సేపటి వరకు ఆ కారును అలాగే గమనిస్తూ ఉండిపోయారు. దీంతో కారు అనుమానాస్పదంగా ఉంది అని భావించి కారు దగ్గరికి వెళ్లి చెక్ చేసారు.


 ఇక కార్ డోర్ తీయగానే అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే కారులో భారీగా గంజాయి బయటపడింది. ఇటీవలి కాలంలో ఇలా అక్రమంగా గంజాయి డ్రగ్స్ సరఫరా చేయడం ఎక్కువైపోయింది. ఈ క్రమంలోనే అటు పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇలా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఎంతోమందిని ఇటీవలి కాలంలో అరెస్టు చేసి కటకటాల వెనుకకు తోస్తూ ఉన్నారు పోలీసులు. అయినప్పటికీ అక్రమార్కులు మాత్రం ఏదో ఒక విధంగా పోలీసుల కళ్లుగప్పి గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.


శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నరసన్నపేట వద్ద ఇటీవలే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒడిషా వైపునుంచి ఒక కారు వచ్చింది.  అయితే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్రాంతం నుంచి కొంత దూరంలో కారు ఆగిపోయింది. కొంతసేపటి వరకు ఆ కారుని గమనించిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే వెళ్లి కార్ లొ చెక్ చేసారు. ఈ క్రమంలోనే కారులో ఉన్న డ్రైవర్ అప్పటికే అందులో నుంచి పారిపోయాడు. ఇక కార్ లో భారీగా గంజాయి ఉండదని గ్రహించాru పోలీసులు. దీంతో ఆ కారుతో పాటు గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: