సర్కారు దవాఖానాల్లో నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇదేనని ఆ కుళ్ళిపోయిన మృతదేహాలను చూస్తేనే అర్థమవుతుంది. అసలు ఆ  మృతదేహాలు ఎక్కడివి.. ఆ మార్చురీలో ఏడాదిన్నర కాలంగా ఎందుకు ఉంచారు. దానికి కారణం ఏమిటి..? ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సరన్నర కాలం పాటు ఆ మృత దేహాలను వారి బంధువులకు ఎందుకు అప్పగించలేదు. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం..?

 ఏడాదిన్నర క్రితం కరోనా వచ్చి మరణించిన మృతదేహాలను ఆ మార్చురీలో ఉంచేవారు. అయితే ఆసుపత్రి నిబంధనల ప్రకారం వాటిని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి మార్చరీలో భద్రపరిచి  చివరికి కరోణ ప్రోటోకాల్ ప్రకారం  ఆ శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలి లేదా దహనం  చేయాలి. కానీ ఆసుపత్రి సిబ్బంది అలా చేయలేదు. ఆ మార్చురీలో ఉన్న రెండు మృతదేహాలను మర్చిపోయింది. దీంతో అవి కుళ్ళి పోయి  చాలా దారుణంగా మారాయి. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. గత సంవత్సరన్నర కాలం నుంచి కరోణతో చనిపోయిన రోగుల రెండు మృతదేహాలు మార్చరీలో పెట్టి మరిచారు. ఆ మృతుల్లో ఒకరి పేరేమో మునిరాజు(66), ఇంకొకరి పేరు దుర్గా సుమిత్ర(40)గా గుర్తించారు. వీరికి కరోనా సోకడంతో  ఈఎస్ఐ దవాఖాన లో చేరారు. చికిత్స జరుగుతుండగానే  జూలై నెలలో  వీరు మృతి చెందారు. దీంతో వీరి మృతదేహాలను మార్చురీకి తరలించారు సిబ్బంది. అప్పటినుంచి ఆ రెండు మృతదేహాలను మర్చిపోయారు. కనీసం వారి కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించలేదు. బెంగళూరు ఈఎస్ఐ దవాఖానాల్లో ఉన్నటువంటి మార్చురీలో  ఆరు కోల్డ్ స్టోరేజ్ లు నడుస్తున్నాయి. గత ఏడాదిన్నర క్రితం ఆసుపత్రిలో కరోణ రోగుల సంఖ్య పెరగడంతో మరణించిన వారి మృతదేహాలను భద్రపరచడం చాలా కష్టంగా మారడంతో, డిసెంబర్ నెలలోనే ఆస్పత్రిలో కొత్త మార్చురీని కట్టారు.


 తర్వాత ఈ మృతదేహాలను ఆ యొక్క కొత్తది మార్చురీ గది లోకి మార్చారు. ఈ సమయంలోనే ఈ రెండు మృతదేహాలను మర్చిపోయి  వదిలేసారు. దీంతో అవి అక్కడే    ఉండిపోయాయి. ఈ సందర్భంలోనే పాత మార్చురీని శుభ్రం చేస్తున్న క్రమంలో ఈ రెండు దేహాలు బయటపడ్డాయి. అవి పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయి. వీటిని చూసినటువంటి సిబ్బంది బీబీఎంపీకి సమాచారం అందించారు. వెంటనే వచ్చిన అధికారులు ఆ మృత దేహాలు  ఎవరివో తెలుసుకొని వారి బంధువులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: