మనం కోర్టులో ఏదైనా కేసు పెట్టినప్పుడు ఆ కేసు ఫైలు  అయిన తర్వాత అది కోర్టులో విచారణ జరిగి తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో విచారణ జరగడానికి కేసులు వేసిన వారు కూడా చనిపోయారు. అలాంటి పరిస్థితులు కోర్టుల్లో జరుగుతున్నాయి.  వీటన్నిటికీ ఇక నుంచి చెక్ పడనుంది. అది ఏంటో తెలుసుకుందామా..? కరోణ దురదృష్టకర ఈ సమయంలో ఏఐ మైలార్డ్ అనే సాంకేతికతను ఉపయోగించబడింది. ఈ కరోనా కారణంగా కోర్టులో అనేక కేసులు పెండింగ్లో పడిపోయాయి. దీంతో న్యాయవ్యవస్థ సరికొత్త సమాలోచనతో సాంకేతికతను ముందుకు తీసుకురానుంది. ఈ సందర్భంలో కేసు వేసే వ్యక్తులు  కోర్టు మెట్లు ఎక్కకుండానే టెక్నాలజీ సాయంతో కేసులు నడిపించే అవకాశం ఉంది. ఈ యొక్క సాంకేతికత సుప్రీంకోర్టుతో పాటు హై కోర్ట్, జిల్లా కోర్టుల్లో తీసుకురానుంది.

 ఈ యొక్క కేసుల్లో బెయిల్ ఇవ్వడం వంటి విధానాలు కోర్టులోనే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మాత్రం కేస్ ఫైల్ చేయడం, వరకు మాత్రమే డిజిటలైజేషన్ పనిచేస్తోంది. ఇక మిగతా విభాగాల్లో మాత్రం డిజిటలైజేషన్ రాలేదు. కోర్టు సిబ్బందికి ఈ యొక్క టెక్నాలజీ నేర్పించడంతో పాటు పోలీసులు, కేసు వేసే  వ్యక్తులు దీని అనుసరించాల్సి వస్తుంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న తరుణంలో త్వరగా కేసులు పరిష్కరించాలని ఆలోచనతో ఈ యొక్క విధానాన్ని అమలు చేస్తే సత్వర న్యాయం చేయాలనే ఆలోచన  చేస్తున్నారు. దేశంలో చాలా కోర్టుల్లో కొన్ని ఏళ్ల తరబడి కేసులు మగ్గుతున్నాయి. వీటిని కృత్రిమ మేధాతో మార్చనున్నాయి. కేసు నిర్వహణ చట్టాల సమాచారం, అల్గారిథం ఆధారిత వ్యవస్థలో మార్పు, పనితీరులో  ఏఐ సహాయం చేస్తుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ పేర్కొన్నారు. దీంతో న్యాయవ్యవస్థలోకి రోబో ని ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇప్పటికే డిజిటలైజేషన్ కావాలని చూస్తున్న భారతదేశ న్యాయ వ్యవస్థకు ఏఐ ఏ విధంగా సహకరిస్తుందో ముందు ముందు కీలకంగా మారే అంశం. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికే చాలా కోర్టుల్లో కృత్రిమ మేధ అనే వ్యవస్థను ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. దీని బాటలోనే మన భారత్ కూడా న్యాయవ్యవస్థను డిజిటలైజేషన్ తీసుకురావాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: