రెండవ దశ అంటూ వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్ లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే ఇలా ఎంతో మందిని బలితీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ ఐదు రెట్లు ప్రమాదకరం అంటూ డబ్ల్యూహెచ్వో ఇప్పటికే హెచ్చరించింది. ఓమిక్రాన్ అనే పేరు వినిపిస్తే  ప్రపంచ దేశాలు మొత్తం భయపడి పోతున్నాయి. అన్ని దేశాల ప్రభుత్వాలు ఇక ఎయిర్పోర్టులో కఠిన ఆంక్షలను  అమలు చేస్తూ ఉండటం గమనార్హం. భారత ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలను  వెలుగులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ భారత్లో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వస్తూ ఉండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.



 అటు భారత ప్రజలందరిలో కూడా ఓమిక్రాన్ వైరస్ కేసుల భయం అంతకంతకు పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే  మళ్ళీ తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైపోతున్నారు అందరు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మాత్రం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. అతను ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఏకంగా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయంతో తన కుటుంబాన్ని చేజేతులారా హత్య చేశాడు. ఆ తర్వాత తన తమ్ముడికి చరవాణిలో సమాచారాన్ని పంపించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం గా మారిపోయింది.



 కాన్పూర్ సిటీ లోని కళ్యాణ్ పూర్ ఏరియా లో నివసించే సుశీల సింగ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ విభాగం లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తన కుటుంబానికి ఓమిక్రాన్ వైరస్ సోకింది అనే భయంతో ఏకంగా దారుణానికి పాల్పడ్డాడు..  భార్య గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మైనర్ అయిన ఇద్దరు పిల్లలపై దాడి చేసాడు. ఏకంగా సుత్తితో కొట్టి పిల్లల పుర్రెలను పగలగొట్టి ప్రాణాలు తీసాడు. కరోనా వైరస్ తో చనిపోతున్నా వారి శవాలని లెక్కించి విసిగి పోయాను. ఇక ఓమిక్రాన్ కాటుకు అందరూ బలికాక తప్పదు.. ముందస్తుగా నా కుటుంబానికి విముక్తి కల్పిస్తూ ఉన్నాను అంటూ సోదరుడికి మెసేజ్ పెట్టాడు. అతను ఇంటికి వచ్చి చూసేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: