చెడ్డి గ్యాంగ్.. ఈ పేరు వింటేనే గుండెల్లో ఏదో తెలియని దడ పుడుతుంది.  ఈ చెడ్డి గ్యాంగ్ ప్లాన్  వేశారంటే దానికి తిరుగు ఉండదు. అలాంటి చెడ్డి గ్యాంగ్ ఇప్పుడు ఎమ్మెల్యేల ఇంట్లోనే టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతోంది. అంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇండ్లనే టార్గెట్ చేసి దోచుకుంటుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజలు భయపడుతున్నారు. మరి ఆ గ్యాంగ్ ఏ ఎమ్మెల్యే ఇల్లును  టార్గెట్ చేశారో తెలుసుకుందామా..!

 అది తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. అది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్  అధికారులతో నిండిపోయి ఉన్నటువంటి పెద్ద విల్లా.. అలాంటి వాటిలో ఎవరైనా అడుగుపెట్టాలంటే దాదాపు కిలోమీటరు దూరం నుంచే ఎన్నో ఆంక్షలు, మరెన్నో నిబంధనలు ఉంటాయి. చాలామంది సెక్యూరిటీ ఉంటుంది. కానీ అక్కడి  ప్రజాప్రతినిధులకు అడ్డాగా ఉన్నటువంటి రెయిన్బో విల్లా పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నది. అక్కడ దొంగతనానికి పాల్పడడం  చాలా ఈజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆ గ్యాంగ్ అక్కడ రెచ్చిపోయింది.. అదే మనందరం పేరు వింటేనే భయపడే చెడ్డీగ్యాంగ్.. ఏకంగా ఎమ్మెల్యే ఇళ్లనే టార్గెట్ గా చేసుకొని చోరీలకు పాల్పడుతోంది. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఇంకోవైపు వైసీపీ ఎమ్మెల్యే విల్లాల్లో చెడ్డీగ్యాంగ్ చోరబడింది  అని తెలుస్తోంది. అయితే ఒక ఎమ్మెల్యే ఇంట్లో చోరి అంటే మామూలు విషయం కాదు. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే. ఈ గ్యాంగ్ అర్ధరాత్రివేళ అందరూ నిద్రలోకి జారుకున్నాక చెడ్డి లతో రంగంలోకి దిగుతారు.  వీరు అర్ధరాత్రి పూట చెడ్డీలు వేసుకొని వీధుల్లోకి చొరబడ తారు. ఆ చెడ్డీలు వేసుకునే దొంగతనాలు కూడా చేస్తారు. వారు ఆ చెడ్డిలలోనే రాళ్లను దాచుకుంటారు.


 ఎవరైనా అడిగితే ఆ రాళ్లతో కొడతారు. వెంటనే అక్కడి నుంచి జంప్ ఐపోతారు. ఒకప్పుడు హైదరాబాద్లో దడ పుట్టినటువంటి చెడ్డి గ్యాంగ్, ప్రస్తుతం  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజృంభిస్తున్నారు. జిల్లా కేంద్రాలతో పాటు సరిహద్దు ఊళ్ళలో కూడా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారని తెలుస్తోంది. దీనిపై స్పందించిన తాడేపల్లి టౌన్ సీఐ సాంబశివరావు ఈ ఘటనకు సంబంధించి నిజంగా చెడ్డి గ్యాంగ్ చేసిందా.. లేదా ఇక్కడి ఆకతాయిలు చెడ్డీలు వేసుకొని చేశారు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: