మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకు వస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. కేవలం క్షణాల వ్యవధిలోనే చూస్తూ చూస్తుండగానే కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయే ఘటనలు కూడా వెలుగులోకి వస్తాయి. సంతోషంగా సాగిపోతున్న జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ సంతోషంగా బతుకుతున్న ఎన్నో కుటుంబాల పై కక్ష గట్టినట్టు వ్యవహరిస్తోంది విధి. ఇక ఇటీవల కాలంలో అభం శుభం తెలియని చిన్నారులు ఎంతో మంది మృతి చెందిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగు చూసింది.




 అభంశుభం తెలియని మూడేళ్ల దినేష్ కుమార్ చివరికి మృత్యువు ఒడిలోకి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధి ఆడిన వింత నాటకంలో అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న దినేష్ కుమార్ కీలుబొమ్మగా  మారాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి ఒక భారీ బస్సు రూపంలో మూడేళ్ల దినేష్ కుమార్ మృత్యువు దూసుకువచ్చి చివరికి ఆ చిన్నారిని చిదిమేసింది. కళ్లముందే అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు చనిపోవడంతో ఆ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అన్నను పాఠశాలకు పంపడానికి నాన్నతో పాటు వెళ్లిన మూడేళ్ల చిన్నారి దినేష్ కుమార్ చివరికి బస్సు టైర్ల కింద పడి ప్రాణాలు వదిలిన విషాదకర ఘటన కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 కోడూరు కు చెందిన శ్రీనివాసరావు ప్రభావతి దంపతులకు ఆదిత్య, దినేష్ కుమార్ కుమారులు ఉన్నారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదిత్య ఎల్కేజీ చదువుతున్నాడు.. ఇక శ్రీనివాసరావు ఆదిత్యను బస్సు ఎక్కించేందుకు తీసుకురాగా వెంటనే దినేష్ కుమార్ నాన్నతో కలిసి వచ్చాడు. అయితే అదే సమయంలో విధి ఆడిన వింత నాటకంలో చివరికి ప్రాణాలు కోల్పోయాడు.  చేతిలోని చాక్లెట్ కింద పడిపోవడంతో దాని తీసుకోవడానికి బస్సు వెనుక చక్రాల కింద కి వెళ్ళాడు. ఇక ఆ చిన్నారిని ఎవరూ గమనించలేదు. ఇక బస్సు డ్రైవర్ ముందుకు నడిపించడంలో చక్రాల కింద తల నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణాన్ని చూసి స్పృహ కోల్పోయి పడిపోయాడు తండ్రి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడనీ శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: