సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఓ ఉపాద్యాయుడు తన కీచక పర్వంతో రెండు రోజుల క్రితం సస్పెండ్ అయ్యాడు. ఇక సస్పెండ్ అయిన టీటీడీ ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ సురేంద్ర ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సురేంద్ర విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడటమే కాక, ఆ మాటలను ఫోన్ లో రికార్డు చేస్తుండేవాడు. అంతేకాదు.. రికార్డు చేసిన మాటలను మళ్లీ వారికే పంపి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేవాడు. సురేంద్ర చెప్పినట్లు వింటే పరీక్షల్లో పాస్ చేస్తానని, పరీక్షలు సరిగా రాయకపోయినా 70 మార్కులు వేస్తానని అమ్మాయిలను లోబర్చుకునే ప్రయత్నించాడు.

ఇక ఈ విషయం బయటకు రావడంతో కళాశాల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోని సురేంద్రను సప్పెండ్ చేశారు. అయితే సురేంద్ర ఇలా సస్పెండ్ కావడం ఇది తొలిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి ప్రవర్తనతోనే సురేంద్ర సస్పెండ్ కు గురైయ్యాడు. ఈ కీచక ప్రినిసిపాల్ సురేంద్ర ఆగడాలు టీటీడీ ఓరియంటల్ కాలేజీ పరువు తీసేలా ఉన్నాయని పలువురు వాపోతున్నారు. తాజాగా తిరుపతి ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి.

అయితే ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథంను కఠినంగా శిక్షించాలని విద్యార్థి, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం అయ్యింది. అంతేకాదు.. ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ బాధిత విద్యార్థినులు వారం రోజుల కిందట టీటీడీ అధికారులను ఆశ్రయించడంతో.. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలంటూ టీటీడీ ఆదేశాలిచ్చారు.

ఇక టీటీడీ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ చేపట్టిన కమిటీ.. ప్రిన్సిపాల్, వార్డెన్ల లైంగిక వేధింపులు నిజమని తేల్చడంతో.. అధికారులు ఆ ఇద్దర్నీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. తమను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్, వార్డెన్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ విద్యార్థినులు, మహిళా సంఘాలు ళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: