ఉద్యొగాల పేరుతో ఈ మధ్య ఎక్కువ మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులొకి వస్తున్నాయి. ఉద్యోగం తప్పకుండా వస్తుంది అని చాలా మంది నమ్మబలికి చివరికి డబ్బులు గుంజుతున్న కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. వేలాది మంది నిరుద్యోగుల నుండి డబ్బులు దండుకుంటున్న గుట్టు రట్టయ్యింది. ఢిల్లీ కేంద్రంగా అక్రమంగా కాల్‌ సెంటర్‌ నడుపుతూ దేశవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని టార్గెట్ చేసి చాలా మందిని దారుణంగా మోసం చేశారు.


ఇటువంటి గ్యాంగ్ పై పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు.ఈ గ్యాంగ్ ను సిటీ సైబర్‌క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన రాజేష్‌ సింగ్‌, అనుభవ్‌సింగ్‌, నఫీజ్‌, సైఫ్‌ అలీ, యోగిత, షాలు కుమారి, ప్రియ, శివానీలు ఒక మఠాగా ఏర్పడి.. మయూర్‌ విహార్‌ పేరుతో ఢిల్లీలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు.'షైన్‌.కామ్ అనే వెబ్‌సైట్ల ను రూపొందించారు. ఈ వెబ్ సైట్ ఉద్యోగం కావాలని రిజిస్టర్ అయిన వారిని టార్గెట్ చేస్తారు. వెబ్‌సైట్‌ ఉద్యోగిగా పరిచయం చేసుకుని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు.


రిజిస్ట్రేషన్‌ ఫీజులు, ఇతరత్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయిని మోసం చేసే క్రమంలో అడ్డంగా దొరికిపోయారు.హైదర్‌గూడకు చెందిన యువతి ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగం కావాలంటూ 'షైన్‌ డాట్‌కామ్‌'లో రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేసింది. ఆ రెజ్యూమ్ ఆధారంగా ఆ యువతిని సంప్రదించారు.ఆ ముఠా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. సెక్యురిటీ డిపాజిట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌తోపాటు వివిధ చార్జీల పేరుతో ఆ యువతి నుంచి రూ. 8,02,426 వసూలు చేశారు. అయినా ఉద్యోగం రాలేదు. డబ్బులు అడిగినా వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితురాలు గత ఏడాది అక్టోబర్‌ 10న సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దాంతో పోలీసులు ఢిల్లీకి చేరుకొని మొత్తం గుట్టును బయట పెట్టారు. వారి నుంచి డబ్బులు, సెల్ ఫోన్ లను స్వాదీనం చేసుకున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: