ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారందరూ కూడా అటు సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది అంటే మంచి జీతం వస్తుంది అని.. దాంతో ఎంతో హాయిగా జీవితాన్ని గడపవచ్చు అని భావిస్తూ ఉంటారు. ఇక సాఫ్ట్వేర్ జాబులు సాధించడం కోసం ఎన్నో కోర్సులు నేర్చుకుంటూ కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉండటం గమనార్హం. ఇక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంటే తమ కంటే తోపు ఎవ్వరు లేరు అని భావిస్తూ ఉంటారు.


కానీ ఎంతో మంది సాఫ్ట్వేర్ జాబ్ లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చివరికి జాబుకు రిజైన్ చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.ఇక మరికొన్ని ప్రాంతాలలో సాఫ్ట్వేర్ జాబు లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ఒక టెక్కి ఒత్తిడి భరించలేక పోతున్నాను అంటూ చివరికి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా సోమ్ శెట్టి నగర్ కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి సత్యనారాయణ సింగ్ కు ఇద్దరు కుమారులు,ఒక కూతురు ఉన్నారు. అయితే చిన్న కొడుకు రూప్ కిషోర్ సింగ్ మాదాపూర్  జియూఎస్ ఎడ్యుకేషన్ ఇండియా కంపెనీలో సాఫ్ట్వేర్ఉద్యోగం చేస్తున్నాడు.


 అతనికి మంచి వేతనం కూడా వస్తుంది.  అయితే సాఫ్ట్ వేర్ జాబ్ లో ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక పోయాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఇటీవల ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ లో ఒక పోస్టు పెట్టాడు. ఇప్పుడు వరకు మీ ఆశీస్సులు ఉన్నాయ్. కానీ పని ఒత్తిడి ఎక్కువైంది. దీంతో నాకు జీవితం మీద విరక్తి వచ్చింది అంటూ మెసేజ్ పెట్టడం తో వెంటనే అప్రమత్తమై కుటుంబ సభ్యులు కిషోర్ స్నేహితుడికి ఫోన్ చేశారు. అయితే అతడు వెంటనే కిషోర్  ఫ్లాట్ కు వెళ్లి చూడగా అప్పటికే కిషోర్ ఉరివేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: