ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల‌లో స్థిరాస్థి వ్యాపార సంస్థ‌ల‌పై ఇటీవ‌ల ఆదాయ‌ప‌న్ను శాఖ దాడులు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. గ‌త వారం మూడు సంస్థ‌ల్లో జ‌రిపిన దాడులు వంద‌ల కోట్ల అక్ర‌మ లావాదేవీలు జ‌రిగిన‌ట్టు ఐటీ శాఖ గుర్తించింది. దీంతో తెలుగు రాష్ట్రాల‌లో మ‌రొక‌సారి క‌ల‌క‌లం రేకెత్తించింది. లెక్క‌లు చూప‌కుండా ఆర్థిక లావాదేవీలు నిర్వ‌హిస్తున్న ఈ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు. ఒక‌టి, రెండు కాదు. ఏకంగా 800 కోట్ల రూపాయ‌ల‌ను అన‌ధికార లావాదేవీల‌ను గుర్తించింది.  

ముఖ్యంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌క‌ట‌న‌లు, క‌స్ట‌మ‌ర్ల‌ను అట్రాస్ చేసి ఆఫ‌ర్లు.. ఇలా కొన్ని రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు ధ‌నార్జ‌నే లక్ష్యంగా త‌మ వ్యాపార కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తూ ఉన్నాయి. ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ్గొడుతూ త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తున్నాయి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది ఆదాయ ప‌న్ను శాఖ‌. ఇక హైద‌రాబాద్‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌లో రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌పై ఐటీదాడులు కొన‌సాగుతున్నాయి. న‌వ్య‌ డెవ‌ల‌ఫ‌ర్స్ స్కందాన్షి ఇన్‌ఫ్రా, రాగ‌మ‌యూరి సంస్థ‌ల‌లో సోదాలు చేపట్టారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌లో రియ‌ల్ ఎస్టేట్ నిర్మాణ రంగంతో సంబంధం ఉన్న ప‌లు సంస్థ‌ల‌కు చెందిన కార్యాల‌యాలు, అనుబంధ సంస్థ‌ల‌తో పాటు ఇత‌ర ప్ర‌దేశాల్లో జ‌న‌వ‌రి 5న ఐటీశాఖ సోదాలు నిర్వ‌హించింది. క‌ర్నూలు, అనంత‌పురం, క‌డ‌ప‌, నంద్యాల‌, బ‌ళ్లారితో పాటు మొత్తం 24 చోట్ల సోదాలు నిర్వ‌హించింది. రియ‌ల్ ఎస్టేట్ కొనుగోళ్ల లావాదేవీల‌కు సంబంధించి చేతిరాత పుస్త‌కాలు, ఒప్పందం చేసుకున్ డాక్యుమెంట్లు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌తో పాటు ప్ర‌త్యేక సాప్ట్‌వేర్‌ల‌ను సీజ్ చేసిన‌ట్టు సీబీడీటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.


లావాదేవీల్లో తేడాలు రాకుండా ఉండేందుకు ప్ర‌త్య‌క్షంగా మార్పు చేసిన ఓ సాప్ట్‌వేర్‌ను సైతం ఓ సంస్థ వినియోగిస్తున్న‌ట్టు ఐటీశాఖ గుర్తించింది. ఆయా సంస్థ‌లు వాస్త‌వ భూమి విలువ కంటే ఎక్కువ మొత్తాన్ని న‌గ‌దు రూపంలో స్వీక‌రిస్తూ.. లెక్క‌లోకి రాని న‌గ‌దుతో భూమి కొనుగోళ్లు, ఇత‌ర ఖ‌ర్చుల‌కు వాడుతున్న‌ట్టు గుర్తించారు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిపిన సోదాల్లో 1.64కోట్లు లెక్క‌లోకి రాని న‌గ‌దును సీజ్ చేయ‌గా.. దాదాపు  800 కోట్లు ఉన్న‌టువంటి లావాదేవీలు గుర్తించిన‌ట్టు వెల్ల‌డించింది ఐటీ శాఖ‌.


మరింత సమాచారం తెలుసుకోండి: