ఓ వ్యక్తి కొన్ని అవసరాలను అధిగమించాలని పర్సనల్ లోన్ కు అప్లై చేసుకున్నారు.. అది లోన్ కు అతను అర్హుడు కాదని బ్యాంక్ సిబ్బంది రిజెక్ట్ చేసాడు.ఆ కోపంతో బ్యాంక్ కు నిప్పు పెట్టేశాడు. అటుగా వెళ్తున్న స్తానికులు అతణ్ణి అతి కష్టంమీద పట్టుకుని చిథకబాదారు. అంతే కాదు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు బ్యాంక్ లో 12 లక్షల రూపాయలు నష్టం జరిగిందని బ్యాంక్ సిబ్బంది వెల్లడించారు..ష్యూరిటీలు లేకున్నా సిబిల్ స్కోరు బాగుంటే సామాన్యులకూ లోన్లు దక్కుతున్నాయి. 



సాధారణంగా బ్యాంకువాళ్లు గనుక లోన్ అప్లికేషన్ తిరస్కరిస్తే చేసేదేమీలేక వేరే మార్గాలు వెతుక్కుంటారందరూ.కానీ ఈ యువకుడు మాత్రం లోన్ ఇవ్వలేదనే కోపంతో ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటక లో వెలుగులోకి వచ్చింది.కర్ణాటకలోని హావేరి జిల్లా రట్టిహళ్లికి చెందిన వసీం హజరత్ సాబ్ ముల్లా అనే యువకుడు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. ఎలాగైనా రుణం పొందాలనే ప్రయత్నాల్లో భాగంగా కెనరా బ్యాంక్ హెడిగొండ బ్రాంచ్ వారిని సంప్రదించాడు. పర్సనల్ లోన్ కోరుతూ బ్యాంక్ మేనేజర్ కు అప్లికేషన్ పెట్టుకున్నాడు.



సరైన పత్రాలను అందించలేకపోయారు.సిబిల్ స్కోరు కూడా తక్కువగా ఉండటంతో రుణం మంజూరు చేయలేమని మేనేజర్ తెగేసి చెప్పాడు. ఈ విషయంలో కోపం పెంచుకున్న ముల్లా.. శనివారం రాత్రి షాకింగ్ చర్యకు ఒడిగట్టాడు. రాత్రి పూట దొంగలా బ్యాంకు బిల్డింగ్ వద్దకు వచ్చి, కిటికీలు బద్దలుకొట్టి, వెంట తెచ్చుకున్న బాటిల్ లో పెట్రోల్ ను లోనికి చల్లి, నిప్పటించాడు.

నిమిషాల్లోనే బ్యాంకులో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన స్థానికులు కొందరు తగలబడుతోన్న బ్యాంకు దగ్గర ముల్లాను చూసి అనుమానంతో పట్టుకోబోయారు. అప్పుడు ముల్లా తన దగ్గరున్న కత్తితో బెదిరించాడు.అతణ్ణి మొత్తానికి పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకులో రూ.12 లక్షల విలువైన సామాగ్రి తగలబడిపోయాయి. ఐదు కంప్యూటర్లు, పాస్ బుక్ ప్రింటర్, క్యాష్ కౌంటింగ్ మషీన్, డాక్యుమెంట్లు, క్యాష్ కౌంటర్ పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు చెప్పారు. నిందితుణ్ని అరెస్టు చేసే విచారించగా.. లోన్ ఇవ్వనందుకు బ్యాంకును తగలబెట్టాలనే ఐడియాను ముల్లాకు ఇచ్చింది ఓ బ్యాంకు మాజీ అధికారేనని తేలింది.. అతని పై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: