శృంగారం అనేది జీవితంలో భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య చోటు చేసుకునే ఒక ప్ర‌క్రియ‌. దీని కోసం పురాత‌న కాలం నుంచే  ఎన్నో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.. జ‌రుతూనే ఉన్నాయి.  కేసులు, కోర్టులు ఇలా నిత్యం శృంగారం విష‌యంలో ఏదో ఒక ప‌రిణామం చోటు చేసుకుంటేనే ఉంటుంది.  ముఖ్యంగా వివాహిత‌లు, అవివాహిత‌ల గౌర‌వాన్ని వేర్వేరుగా చూడ‌లేము అని ఢిల్లీ హై కోర్టు పేర్కొన్నది. పెళ్లి అయినా.. కానున్నా ఇష్టంలేని లైంగిక చ‌ర్య‌ను నిరాక‌రించే హ‌క్కు ప్ర‌తి మ‌హిళ‌కూ ఉంటుంద‌ని ఉద్ఝాటించింది కోర్టు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప‌రిగ‌ణించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ రాజీవ్ శ‌క్దేర్‌, జ‌స్టిస్ హ‌రిశంక‌ర్‌ల ధ‌ర్మాస‌నం ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

వివాహం జ‌రిగినంత మాత్రాన భ‌ర్త బ‌ల‌వంతంగా లైంగిక చ‌ర్య‌కు పాల్ప‌డినా.. మ‌హిళ కేవ‌లం ఇత‌ర సివిల్‌, క్రిమిన‌ల్ చ‌ట్టాల‌నే ఆశ్ర‌యించాలా..?  భార‌త శిక్షాస్మృతి ఐపీసీ-375 సెక్ష‌న్ ఆ కేసులో వ‌ర్తించ‌దా..? ఇది స‌రికాదు అని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. పెళ్లి చేసుకున్నంత మాత్రానా.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాక‌రించే హ‌క్కు మ‌హిళ‌లు కోల్పోతారా అని ప్ర‌శ్నించింది. అదేవిధంగా ఐపీసీ 375 సెక్ష‌న్ ప‌రిధిలో భ‌ర్త అధిక‌ర‌ణం -14 అధిక‌ర‌ణం 21ల‌ను ఉల్లంఘించేలా ధ‌ర్మ‌స‌నానికి ఉంద‌ని పేర్కొంది.50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తున్న సంత‌తిని గుర్తు చేసింది.

ఢిల్లీ ప్ర‌భుత్వం త‌రుపు న్యాయ‌వాది నందిత రావ్ మాత్రం భ‌ర్త‌ల‌కు ప్ర‌స్తుతం ఉన్న మిన‌హాయింపుల‌ను ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని వాదించారు. ఈ మిన‌హాయింపులు భార్య‌ల గౌర‌వానికి భంగం క‌లిగిస్తున్న‌ట్టు నిరూపించ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. దీంతో శ‌క్దేర్ క‌లుగ‌జేసుకుని ఓ మ‌హిళ నెల‌స‌రిలో ఉన్న‌ప్పుడు భ‌ర్త‌తో శృంగారంలో పాల్గొనేందుకు నిరాక‌రించర‌నుకోండి. అయిన‌ప్ప‌టికీ బ‌ల‌వంతంగా లైంగిక చ‌ర్య‌కు పాల్ప‌డ్డార‌నుకొండి. అది నేరం కాదా..? అని ప్ర‌శ్నించారు. అది ఒక‌విధంగా నేర‌మే. కానీ అత్యాచార చ‌ట్టం కింద‌కు రాదు అని నందిత బ‌ద‌లు ఇచ్చారు. న్యాయ‌మూర్తి స్పందిస్తూ ఇదే ఇప్పుడూ ప్ర‌శ్నార్థ‌కం అవుతుంది స‌హ‌జీవ‌నం చేసే వారి విష‌యంలో ఈ చ‌ర్య ఐపీసీ -375 ప‌రిధిలోకి  వ‌స్తుంది. వివాహిత విష‌యంలో ఎందుకు రాదు..? స‌ంబంధాన్ని బ‌ట్టి అలా చెప్ప‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు న్యాయ‌మూర్తి.




మరింత సమాచారం తెలుసుకోండి: