కొడుకు అంటే పున్నామ నరకం నుండి కాపాడేవాడు అని అంటుంటారు. కానీ ఓ కొడుకు కన్న తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ సంఘటన కేరళలోని పాలక్కడ్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పాలక్కడ్‌లోని పుదుప్పారియారం ప్రాంతంలోని ఒట్టురుకావు ప్రాంతంలోని నివాసం ఉండే చంద్రన్ (64), ఆయన భార్య దేవి (54) సొంత ఇంట్లో దారుణంగా హత్యకి  గురైయ్యారు. అయితే ఉదయం ఎంతసేపవుతున్నా ఎవరూ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఇక పోలీసులు వచ్చి డోర్ బద్ధలు కొట్టి చూసేసరికి ఇంట్లో చంద్రన్, దేవి చెరో దగ్గర రక్తపు మడుగులో కనిపించడంతో అందరు షాక్ అయ్యారు. అయితే వంట గది దగ్గరలో దేవి, బెడ్రూంలో చంద్రన్ విగత జీవులుగా పడి ఉన్నారు. కాగా.. ఈ కేసులో వాళ్ల కొడుకు సనల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. పోలీసులు చేపట్టిన విచారణలో ఈ సైకో సన్ జరిగిందంతా వెల్లడించారు. నిందితుడు మాటలు విన్న పోలీసులు విస్తుపోయారు.

అయితే నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోకి వెళ్లిన తను తొలుత ఫ్రంట్ డోర్ లాక్ చేసి.. ఆ తర్వాత తల్లి ఉన్న దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇక కొడుకును చూసిన ఆమె కాసిన్ని మంచినీళ్లు తీసుకురమ్మని కోరింది. ఈ నేపథ్యంలో ఆమెతో గొడవ పడిన ఈ సైకో కొడుకు పక్కనే ఉన్న వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి కన్న తల్లిని అత్యంత పాశవికంగా పొడిచి చంపేశాడు. ఇక ఆమెను పలుమార్లు పొడుస్తూ పైశాచిక ఆనందం పొందడమే కాక.. అంతటితో ఆగాక చంద్రన్ పడుకున్న రూంకు వెళ్ళిపోయాడు. కాగా.. కన్న తండ్రిని కూడా దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: