ఒకప్పుడు దొంగతనాలు అంటే ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకు వెళ్లడం లాంటివి చేసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం దొంగతనాల్లో కూడా కొత్త పుంతలు తొక్కుతూ ఉండటం గమనార్హం. కష్టపడి ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేయడం కాదు మాయమాటలతో ఎలాంటి కష్టం లేకుండానే జనాల్ని బురిడీ కొట్టించి దొంగతనాలకు పాల్పడటానికి ప్రయత్నిస్తున్నారు నేటి రోజుల్లో మోసగాళ్లు.  ఇటీవల ఏలూరు లో కూడా ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.


 ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక యువకుడు ఏలూరు కూడలి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు. అటువైపుగా వెళుతున్న జయశంకర్ మానవత్వాన్ని చాటుకుని కింద పడిన యువకుడిని లేపెందుకు  ప్రయత్నించాడు. ఇంతలోనే మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి సహాయం కూడా చేశారు. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్టు బయటపడింది. ఇలా బైక్ అదుపు తప్పి కింద పడిపోయిన యువకుడు సహాయం చేయడానికి వచ్చిన ఇద్దరు యువకులు కూడా ఓకే ద్విచక్రవాహనంపై ఎక్కి తుర్రుమన్నారు. దీంతో ఏం జరిగిందని షాక్ లో ఉన్న జయశంకర్ ఆ తర్వాత చెక్ చేసుకోగా  పదిహేను వేల విలువైన చరవాణి కనిపించకుండా పోయింది.


 మీకు కంప్యూటర్ వర్క్ వచ్చా అయితే ప్రతిరోజు రెండు వేల వరకు సంపాదించవచ్చు అంటూ ఒక  ప్రకటన చూసి యువతి ఆకర్షితురాలైంది. ఇంకేముంది వారిని సంప్రదించగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆ తరువాత పెట్టుబడి పెడితే లాభం వస్తుంది అని చెప్పడంతో 200 పెట్టుబడి పెట్టి 300 రూపాయలు వచ్చాయి. దీంతో ఇక నమ్మకం కుదిరి విడతలవారీగా మూడున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టగా 7 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని ఫోన్ లో మెసేజ్ వచ్చింది. కానీ ఆ సొమ్ము అకౌంట్ లోకి రాకుండా కేవలం మెసేజ్ రూపంలోనే పరిమితం అయింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇలా నేటి రోజుల్లో  చిత్ర విచిత్రంగా జనాల్ని బురిడీ కొట్టిస్తున్న నేరాలకు పాల్పడుతున్న వారు పెరిగిపోతున్నారు. అందుకే అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్ లు గాని ప్రకటనలు గాని అసలు నమ్మొద్దు అంటూ అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: