మళ్లీ మొదలైన మావోయిస్టుల అలజడి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్ర గుట్ట సమీపంలో చత్తీస్గడ్ బాడర్ వద్ద మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పుల మోత మోగింది అని తెలుస్తోంది. మరి ఈ ఘటనలో ఎవరెవరు గాయపడ్డారో తెలుసుకుందామా..? ములుగు జిల్లా చత్తీస్గడ్ సరిహద్దుప్రాంతాల్లో కాల్పుల మోత మోగింది.పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు.వెంకటాపురం మండలం కర్రె గుట్ట అటవీ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

 మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయమయ్యింది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రీ గుట్ట వద్ద ఈ కాల్పుల ఘటనలో చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల పరంపరలోనే అటు మావోయిస్టులు మరోవైపు పోలీసులు కూడా గాయపడ్డారు.  చత్తిస్ ఘడ్ సరిహద్దు ప్రాంతం కాబట్టి చత్తిస్ ఘడ్ నుంచి వచ్చిన  మావోయిస్టులు డెన్ లు వేసుకొని అక్కడ కొద్ది రోజులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం పూట తెలంగాణ సంబంధించినటువంటి గ్రేహౌండ్స్ కూంబింగ్ లో భాగంగా చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

 అక్కడ భారీ ఎత్తున మావోయిస్టు ఉన్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మావోయిస్టులు పోలీసుల చేతిలో చనిపోయారు. ఇంకా పోలీస్ ఫైర్ కూంబింగ్ కొనసాగుతుంది. ఇంకా చాలా మంది మావోయిస్టులకు గాయాలయ్యాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గాయాలపాలైన కానిస్టేబుల్ ని ములుగు హాస్పిటల్ కు తరలించారు. ఇటు తెలంగాణ గ్రేహౌండ్సే కాకుండా, అటు చత్తిస్ ఘడ్ పోలీసుల సహకారం తీసుకొని పూర్తి స్థాయిలో కూడా కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.మరి ఈ కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ కాల్పుల్లో ఎంత మంది పోలీసులు మావోయిస్టులు చనిపోతారో అనేది చాలా ఆందోళన కలిగించే విషయం. ఏది ఏమైనా మావోయిస్టుల అలజడి మళ్ళీ మొదలు అయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: