ఆ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. ఆమె ఆమె భర్త కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగినే. ఇద్దరికీ మంచి వేతనం.. ఆమె ప్రస్తుతం పుట్టింటి వద్ద ఉంటూనే వర్క్ చేస్తుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆమె రోడ్డుపక్కన శవమై కనిపించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన తనూజ, మణికంఠ దంపతులు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఒక్క బాబు ఉన్నాడు.

దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభించడంతో వారు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వీరి జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈనెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తనూజ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. దాంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి విచారిస్తున్న తరుణంలో విజయవాడ శిఖామణి సెంటర్ సమీపంలో రోడ్ పక్కన ఒక మహిళ మృతదేహం ఉందని లభ్యమైంది.

ఆ మహిళా వివరాలు తెలియక పోవటంతో గుర్తు తెలియని మృతదేహంగా నిర్ధారణకు వచ్చిన విజయవాడ పోలీసులు మృతదేహాన్ని తరలించారు. మరోవైపు గుంటూరు పోలీసులు తనూజ ఫోటోతో పోల్చిచూడగా ఆ మృతదేహం తనూజ అని నిర్దారణకు వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. వారు తనూజ మృతదేహంగా గుర్తించారు. ఇప్పటికి తనూజ మృతిపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగా భావించినా.. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం అనుమానాలకు దారి తీసింది.

అంతేకాదు.. గుంటూరులో అదృశ్యమైన తనూజ విజయవాడలో శవమైన కనిపించడంతో పోలీసుల అనుమాలు మరింత బలపడ్డాయి. దీంతో ఆమె మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే తనూజ  ఇంటి నుంచి ఎందుకు వచ్చేసింది.. వచ్చేముందు ఏమైనా గొడవ జరిగిందా..? కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందా..? అనే కోణంలో విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: