అందరికి తెల్సిన అంతవరకు పల్లెటూరిలో పట్టింపులు ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. అయితే వారి పట్టింపులకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన కర్ణాటకలో చైతు చేసుకుంది. పార్టీ వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హసన్ జిల్లా అర్సికెరె తాలూకాలోని పుర్లెహళ్లి అనే గ్రామానికి చెందిన గిరీష్, శరత్ (28) అనే ఇద్దరు యువకులు వారి కుటుంబాలతో కలిసి శకరాయపట్నం సమీపంలో ఉన్న చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్ళాడు.

అయితే వారు మొక్కులు చెల్లించుకున్న తర్వాత అందరూ సాయంత్రం గ్రామానికి చేరుకుని ఎవరి ఇళ్లకు వాళ్లువెళ్లారు. ఇక నటరాజు, అతని కుటుంబం మాత్రం తమను ఈ కార్యక్రమానికి పిలవకపోవడంపై ఆరోజు సాయంత్రం ఊళ్లో నానా రచ్చ చేయడమే కాకుండా రీష్‌తో, శరత్‌తో, ఇరు కుటుంబాలతో ఈ విషయంలో వాగ్వాదానికి దిగారు. ఇక ఊరిలో అయినవాళ్లందరినీ పిలుచుకుని మమ్మల్ని ఎలా మర్చిపోతారంటూ ఘర్షణకు పాల్పడారు.

స్థానికులు ఇరు కుటుంబాలను నచ్చజెప్పినప్పటికీ గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే ఊరి పెద్దలు కూడా నటరాజు కుటుంబ తీరును తప్పుబట్టడంతో నలుగురిలో అవమానం జరిగిందని భావించిన నటరాజు గిరీష్, శరత్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శరత్, గిరీష్‌తో పాటు రాకేష్, యోగేష్ అనే మరో ఇద్దరు యువకులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శరత్‌ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. అయితే  28 ఏళ్ల వయసున్న కొడుకు.. రేపోమాపో పెళ్లి చేయాలని భావిస్తున్న తరుణంలో ఇలా ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మృతుడి తల్లిదండ్రులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: