ఓ వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇక బిజినెస్ బాగా సరిగ్గా సాగడంతో కుటుంబ సభ్యులు సంతోషంగా గడుపుతుండేవారు. అంత మంచిగా సంతోషంగా నడుస్తుంది అనే సమయంలోనే ఆ వ్యక్తికి క్రికెట్ బెట్టింగ్ అలవాటైంది. దీంతో అతడు అప్పులు చేయడం మొదలు పెట్టాడు. చివరికి ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌లోని జరిపట్కాకు చెందిన కిరణ్మయి(33), మదన్ అగర్వాల్ (40) దంపతులు ఉన్నారు. ఈ దంపతులకు పదేళ్ల రిషబ్ అనే కొడుకు, తోషిత అనే ఐదేళ్ల పాప కూడా ఉన్నారు. మదన్ అగర్వాల్ పాస్ట్ పుడ్ సెంటర్ నడుపుతూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. కానీ అతడికి బెట్టింగ్ వ్యసనం పట్టడంతో చిన్నగా అప్పులు చేయడం స్టార్ చేశాడు. ఇక చివరకి బ్యాంకు అప్పుకు సంబంధించిన నెలవారీ వాయిదా డబ్బు చెల్లించలేదని గతేడాది అతని ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్కూడా చేశారు.

అయితే  మదన్ అగర్వాల్ అదే ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఇక అతడు  క్రికెట్ బెట్టింగ్స్‌లో సర్వం కోల్పోవడమే కాకుండా అప్పుల పాలు కావడంతో మదన్ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. కాగా.. మదన్ అగర్వాల్ దాదాపు 90 లక్షల వరకూ అప్పులు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే గత సోమవారం రాత్రి మదన్‌ బ్యాంక్ అకౌంట్‌కు అతని అన్నయ్య అమిత్ రూ.1,500 పంపించాడు.

చివరికి క్రికెట్ బెట్టింగ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు పోవడం, అప్పుల పాలు కావడంతో మదన్ కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. దాంతో ఇంట్లో భార్యాపిల్లలు తిని నిద్రపోయాక కత్తితో ముగ్గురినీ పొడిచి తరువాత తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మరసటి రోజు మాధవన్ స్నిహితుడి ఇంటికి వెళ్లగా అందరు అపస్మారక స్థితిలో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి స్నేహితుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: