ఇటీవల కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం చిన్నచిన్న ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాల కోసం పోటీ పడుతున్న  విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగం సాధించాము అంటే చాలు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు అని అనుకుంటూ ఉంటున్నారు ఎంతోమంది. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం ఎంతో సంతోషంగా బ్రతకడానికి కావలసింది ప్రభుత్వ ఉద్యోగం కాదు కాసింత మనశ్శాంతి అన్నది మాత్రం అర్థమవుతోంది. ఎందుకంటే ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులు గా పని చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నారు ఇద్దరు భార్యాభర్తలు.  అంతా సాఫీగా సాగిపోతున్న అనుకుంటున్న సమయంలో భర్త ఆత్మహత్య  చేసుకొని బలవన్మరణానికి పాల్పడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.



 ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు మంచి జీతం కూడా వస్తుంది కానీ ఊహించని సమస్యలతో శాంతి లేకుండా పోయింది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం తో ఇక ఇద్దరు భార్య భర్తలు కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దీంతో ఇక బ్రతకడం కంటే చావడమే మేలు అని అనుకున్నాడు భర్త. ఊహించని రీతిలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. వెంగళరావు నగర్ లో పని కుమార్ భార్యతో కలిసి నివాసముంటున్నాడు.


 ఫణి కుమార్ భార్య ఉషారాణి కలిగిరి మండలం అయినా గుడ్ల దొన గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్త ఫణికుమార్ పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల వివిధ వ్యాపారాలు పై పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాడు ఫణికుమార్. మానసికంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఇటీవలే ఉపాధ్యాయుల కలెక్టరేట్ ముట్టడిని నివారించేందుకు ఎస్ఐ ఆదేశంతో ఉషారాణి ఉదయం సమయంలో విధులకు బయలుదేరింది.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు భర్త ఫణికుమార్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: