మనిషి ఆలోచనా తీరు ఎంత నీచంగా మారిపోతుందని నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం గా భావించేవారు. ఇక మాకు ఆడపిల్ల వద్దు అని చెత్తకుప్పలో పడేసేవారు. ఇలాంటివి జరిగేవి కానీ మహిళల పై అత్యాచారాలు జరిగేవి కాదు. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఒకప్పుడే నయం ఏమో అనిపిస్తుంది  నేటి రోజుల్లో ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. కానీ ఆ ఆడపిల్లను అడుగడుగునా రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తమ కూతురి పై మానవ మృగాలు  దాడి చేస్తారో అని అనుక్షణం ప్రతి ఒక్క తండ్రి భయపడుతూనే బతుకుతున్నాడు. ఇలా నేటి రోజుల్లో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.



 కామందుల బారిన పడకుండా ఉండేందుకు ఆడపిల్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మానవ మృగాలు మాత్రం రెచ్చిపోతూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కళ్ళ ముందు ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారం చేయడం తప్ప మరో ఆలోచన చేయడం లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పెళ్ళయిన రెండేళ్ళకే భర్తతో మనస్పర్థలు వచ్చాయి ఆ మహిళకు. దీంతో భర్తతో విడాకులు ఇప్పించాలంటూ ఒక న్యాయవాదిని ఆశ్రయించింది ఆమె. అయితే న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన ఆ మహిళ పైన కన్నేసాడు న్యాయవాది. చివరికి అత్యాచారానికి పాల్పడ్డాడు.  దీంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల ముందు చెప్పింది.


 ఈ ఘటన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇటీవలే భర్తతో గొడవలు కావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. విడాకులు ఇప్పించాలంటూ గత ఏడాది జూన్లో న్యాయవాదిని సంప్రదించింది. అయితే ఇక పలుమార్లు కేసు విషయంపై తన కార్యాలయానికి మహిళనూ రప్పించుకున్న న్యాయవాది ఆమెతో చనువు పెంచుకొని బాధితురాలిని  తాను ఉంటున్న కాలనీలో ఒక ఇల్లు అద్దెకు ఇప్పించాడు. ఈ క్రమంలోనే ఇంట్లో కెమెరాలు పెట్టి మహిళను నగ్నం గా ఉన్నప్పుడు ఫుటేజీ రికార్డ్ చేసి మహిళనూ బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజురోజుకు వేధింపులు ఎక్కువవడంతో  మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: