తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఎవరికీ ఉండదు. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం అనేది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఇటీవల కాలంలో ఎంతోమంది ఇలా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించడానికి అటు ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఎంతో అనుభవం కావాలి. ఎలాంటి అనుభవం లేకుండా ట్రేడింగ్ చేశారు అంతే లాభాలు రావడం విషయం పక్కనపెడితే ఉన్నది కూడా ఊడ్చుకు పోతుంది. తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఎలాంటి అనుభవం లేకుండా ట్రేడింగ్ లో డబ్బులు పెట్టి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు.



 ఇక్కడ ఓ మెకానికల్ ఇంజనీర్ కూడా ట్రేడింగ్ లో డబ్బులు పెట్టి భారీగా  నష్టపోయాడు. అయితే  ఇక ట్రేడింగ్ నష్టపోయిన డబ్బులు తిరిగి ఎలా పొందాలి అని ఆలోచించాడు. అతని మైండ్ లో ఉద్యోగం వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచన రాలేదు. దొంగతనం చేస్తే  ఎంతో సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకున్నాడు. మనసులో ఈ ఆలోచన వచ్చిందో లేదో దాన్ని అమలు లో పెట్టడం మొదలుపెట్టాడు.. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఏం వస్తుంది అనుకున్నాడో ఏమో.. ఏకంగా బ్యాంక్ కె కన్నం వేసేందుకు సిద్ధమైపోయాడు ఈ మెకానికల్ ఇంజనీర్.


 ఈ క్రమంలోనే బ్యాంకు లోకి చొరబడి వెంట తెచ్చుకున్న కత్తితో బ్యాంక్ సిబ్బందిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే 3.76 లక్షల నగదుతో పాటు 1.80 కిలోల బంగారు ఆభరణాలను కూడా దోచుకెళ్లాడు ఆ దొంగ. అయితే నిందితుడు బ్యాంకు నుంచి బయటకు వెళ్లగానే బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. అంతేకాకుండా ఇక నిందితుడు దోచుకెళ్లిన నగదు నగలను  మొత్తం రికవరీ చేసి బ్యాంకు అధికారులకు అప్పగించారు. ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: