దొంగలు అర్దరాత్రి లో మాత్రమే దొంగతనాలు చెయ్యడానికి వెళ్తారు. ఆ సమయంలో వాళ్ళు దొంగతనాలు చేయడం చాలా సులువుగా ఉంటుంది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు.. అప్పుడే వాళ్ళు దొచిన కాడికి దొచుకోవచ్చు.. అయితే వాళ్ళు దొంగతనం చేయాలి అంటే చాలా రిస్క్ చేయాలి.. ఇలాంటి సమయంలో ఎన్నో ప్రమాదాలను కూడా ఎదుర్కొవాలి. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలను కొల్పొయారు. ఇకపోతే ఒక దొంగ కట్టుకున్న లుంగీ వల్ల తన ప్రాణాలును పోగొట్టుకున్నారు.. ఇది నిజంగా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. 



దొంగ అర్దరాత్రి వెళ్లాడు.. వెళ్ళి గేట్ దుకెందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతని లుంగీ మెడకు బిగుసుకొని యమపాసంగా మారింది.ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది.. ఇది ఇప్పుడు ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది..వివరాల్లొకి వెళితే.. నగరంలోని బార్కస్‌ జమాల్‌బండ ప్రాంతానికి చెందిన హుస్సేన్‌ బిన్‌ అలీ జైదీ మద్యానికి బానిసై తరచూ దొంగతనాలు చేస్తుండేవాడు.. శనివారం రాత్రి కూడా ఆయన దొంగతనం చేయడానికి వెళ్ళాడు.



సలాలా పీలిదర్గా రోడ్డులో ఉన్న పాత మోటారు పార్ట్స్ గోదాంలో చోరీకి వెళ్లాడు. అక్కడ పెద్ద గెట్ ఉంది. ఆ గెట్ ను దుకే ప్రయత్నాలు చేసాడు. ఈ క్రమం లో అతను కట్టుకున్న లుంగీ గేటుకు చిక్కుకుంది. నడుం వద్ద లుంగీ ముడివేసి ఉండటంతో అది పొట్ట, ఛాతీ భాగం దగ్గర చుట్టుకు పోయింది. మొత్తం గొంతు ను పట్టేసింది. దాంతో చాలా సేపు పోరాడాడు. చివరికి శ్వాస ఆడక ప్రానాలను కోల్పోయాడు. గోదాం సిబ్బంది అక్కడి వెళ్లినప్పుడు గేటుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: