నేటి సమాజంలో ఏది కావాలని అనుకున్న ఇంట్లో ఉండి ఆర్డర్ పెడితే చాలు వాళ్లే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ టెక్నాలజీని చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరు వాడుతున్నారు. ఇక టెక్నలజి ఎంతగా పెరిగిందో క్రైమ్ రేట్ కూడా అంతేలా పెరిగింది. అయితే తాజగా రూ.100 థాలీ తీసుకుంటే రెండు థాలీలు ఉచితం అంటూ ఓ వృద్ధుడుని మోసం చేసిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ముంబై నగరంలోని ఖార్‌ ప్రాంతానికి చెందిన ఎన్డీ నంద్ అనే ఓ 74 ఏళ్ల వృద్ధుడు జనవరి 19న ఫేస్‌బుక్‌లో పోస్టులు అతడికి ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ కనిపించింది. అయితే అందులో ఏం ఉందని అనుకుంటున్నారా.. 100 రూపాయలకే ఓ థాలీతోపాటు రెండు థాలీలను ఉచితంగా అంటూ ఉంది. ఇక 100 రూపాయలకే ఇంటిల్లపాది మూడు పూటలా తినేసేంత ఆహారం లభిస్తుంది కదా అని సదరు వృద్ధుడు ఆశతో ఆ యాడ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేశాడు.

ఇక ఫోన్ లో వ్యక్తి మాట్లాడి నేను దీపక్‌ని మాట్లాడుతున్నానని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేయడానికి మీ క్రెడిట్ కార్డ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అయితే మొదట్లో రూ.10 ఛార్జ్ చేసి డెలివరీ అయ్యాక మిగతా నగదు చెల్లించండి అని చెప్పుకొచ్చాడు. అతడి మాటలు నమ్మాడు. అనంతరం ఆర్డర్‌ను కంప్లీట్ చేసేందుకు మీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను షేర్ చేయమని గుర్తు తెలియని వ్యక్తి నంద్ ని అడిగాడు.

ఆ వ్యక్తి మాటలు నమ్మించిన అతను ఓటీపీని షేర్ చేశాడు. ఇక మరుక్షణంలోనే అతడి ఫోన్‌కు రెండు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి.. అందులో ఏం ఉందంటే.. తన క్రెడిట్ కార్డ్ నుంచి ఒకసారి రూ.49,760.. రెండోసారి రూ.49,760 నగదు డ్రా అయినట్టు చూపించింది. అయితే నంద్ ఓ బూటకపు ప్రకటనకు బలై తన క్రెడిట్ కార్డ్‌లోని రూ.99,520 పోగొట్టుకున్నాడు. ఇక అతను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: