సిద్దిపేటలో అప్ప‌టి వ‌ర‌కు అంతా ప్ర‌శాంతంగానే ఉన్న‌ది. ఉన్న‌ట్టుండి మ‌ధ్యాహ్నం స‌మ‌యం వేళ ఏమైందో ఏమో తెలియ‌దు కాల్పులు క‌లక‌లం సృష్టించాయి. ప‌ట్ట‌ప‌గ‌లే కాల్పులు జ‌రిపి దారి దోపికి పాల్ప‌డ్డారు ఆ దుండ‌గులు. సిద్దిపేట అర్బ‌న్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యం ముందే ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లితే..  దొమ్మాట మాజీ స‌ర్పంచ్, సిద్దిపేట స్థిరాస్థి వ్యాపారి అయిన‌టువంటి న‌ర్స‌య్య  వ‌ద్ద నుంచి ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు శ్రీ‌ద‌ర్‌రెడ్డికి విక్ర‌యించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవాళ సిద్దిపేట రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యానికి స్థ‌లం రిజిస్ట్రేష‌న్ చేయించుకోవడానికి వ‌చ్చాడు. ఈ స‌మ‌య‌లోనే కారులో డ్రైవ‌ర్ వ‌ద్ద ఉన్న రూ.43.50ల‌క్ష‌ల న‌గ‌దును ఇద్ద‌రు దుండ‌గులు దోచుకొని పారిపోయారు.


సోమ‌వారం రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌లో  భాగంగా సిద్దిపేట కార్యాల‌యానికి వారిరువురూ చేరుకున్నారు. ఈ తురుణంలో కొనుగోలు దారుడు రూ.43.50ల‌క్ష‌ల‌ను న‌ర్స‌య్య‌కు అప్ప‌గించాడు. ఆ మొత్తాన్ని త‌న కారు డ్రైవ‌ర్ ప‌ర‌శురామ్‌కు అప్ప‌గించి కారులోనే కూర్చోవాల‌ని చెప్పి ఆయ‌న రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యానికి వెళ్లాడు. అదే స‌మ‌యంలో ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చి కారు అద్దాల‌ను ధ్వంసం చేసారు. దీంతో డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తం అయి కారు ముందుకు క‌దిలించే ప్ర‌య‌త్నం చేసారు. ఈ త‌రుణంలోనే ఓ వ్య‌క్తి తుపాకితో డ్రైవ‌ర్‌పై కాల్పులు జ‌రిపారు. వెను వెంట‌నే మ‌రొక వ్య‌క్తి ప‌క్క సీటు లో ఉన్న న‌గ‌దు సంచిని లాక్కెల్లారు. గాయ‌ప‌డిన డ్రైవ‌ర్‌ను స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌ను అంద‌జేసారు. హుటాహుటిన స‌మాచారం తెలుసుకున్న పోలీస్ క‌మిష‌న‌ర్ శ్వేత అక్క‌డికి చేరుకుని ఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఆ దుండ‌గుల‌ను పట్టుకునేందుకు 15 బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు ఆమె తెలిపారు.  కేసు న‌మోదు చేసుకుని నిందితుల కోసం ముమ్మ‌రంగా గాలింపులు చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు క‌మిష‌న‌ర్ శ్వేత‌. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యం వ‌ద్ద బందోబ‌స్త్ ఏర్పాటు చేయాల‌ని బాధితులు పేర్కొంటున్నారు. అస‌లు తెలిసిన వారే ఈ ప‌ని చేశారా..?   లేక ఎవ‌రూ ఈ చోరీకి పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: