ఇటీవలి కాలంలో ఫుల్లుగా మద్యం తాగడం.. నడిరోడ్డుపై హల్ చల్ చేయడం జనాలకి కామన్ గా మారిపోయింది. అంతేకాదు ఇటీవల కాలంలో కొంతమంది అయితే ఏకంగా విచక్షణ కోల్పోయి పక్కన ఉన్న వాళ్ళ పై దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే కామన్ మ్యాన్ గా ఉన్నవారు ఇలా నడిరోడ్డుపై తప్పతాగి రచ్చ చేస్తే ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అంటూ లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూ ఇక తప్పతాగి ఇలాంటివి చేస్తే అందరూ తిట్టి పోస్తూ ఉంటారు. సాధారణంగా ప్రజలందరికీ సర్వీస్ చేసే ఒక ప్రభుత్వ ఉద్యోగం లో కొనసాగుతున్న ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి.



 కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొంతమంది ఏకంగా బాధ్యతగల పదవిలో కొనసాగుతూ కూడా మద్యం మత్తులో రచ్చ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆమె ఏకంగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగు తోంది. అయితే ఇక ఎంతో హుందాగా మెలుగుతూ ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఆమె ఇటీవల ఏకంగా తప్ప తాగి రచ్చ చేసింది. ఏకంగా పోలీసు అధికారులు ఎంతలా సముదాయించేందుకు ప్రయత్నించిన కూడా వినకుండా నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.



 యూపీలో మహిళా డిప్యూటీ లేబర్ కమిషనర్ గా పని చేస్తూ ఉంది రచన కేసర్వాణి ఇటీవలే మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసింది. ఈ క్రమంలోనే  కారు డ్రైవ్ చేస్తూ ఏకంగా డివైడర్ను ఢీకొట్టింది. అయితే అక్కడే ఉన్న పోలీసులు ఆమెను కారు నుంచి బయటకు తీశారు. దీంతో ఏకంగా పోలీసుల తోనే వాగ్వివాదానికి దిగింది. మీరు కేవలం పోలీసులు నేను జిల్లా స్థాయి అధికారి నన్ను ఆపొద్దు అంటూ పోలీసులపై దౌర్జన్యం చేసింది. పోలీసులు ఎంత సముదాయించేందుకు ప్రయత్నించినా వినకుండా రచ్చ చేసింది. దీంతో ఇక ఆమె భర్త కు ఫోన్ చేసి రప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారగా ఆమె పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు  కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Up