ప్రేమ అనేది రెండు మనసుల మధ్య పుట్టేది. అది ఎప్పుడు ఏ క్షణంలో ఎవరి మధ్య పడుతుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. అయితే ఒకరికి ప్రేమ పుట్టినప్పుడు మరొకరికి ప్రేమ పుట్టాలి అని రూలేమీ లేదు. ఇక ఒక్కరూ తమ మనసులో ఉన్న ప్రేమను వ్యక్త పరిచినపుడు మరొకరు దానిని అంగీకరించాలి అన్నా చట్టం కూడా లేదు. నచ్చితే ప్రేమిస్తారు నచ్చకపోతే ప్రేమను రిజెక్ట్ చేస్తారు. ఇలా రిజెక్ట్ చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రేమను రిజెక్ట్ చేయడం ఎంతో మంది పాలిట శాపంగా మారిపోతుంది.


 ఇక తమ ప్రేమను అంగీకరించడం లేదు అనే కారణంతో ఎంతోమంది ప్రేమోన్మాదులు రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  ఇలా రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు అందరిని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఏకంగా ప్రేమించిన యువతిని ప్రేమను నిరాకరించిందని ఏకంగా అప్పటి వరకు ప్రాణంగా ప్రేమించా అంటూ వెంట తిరిగిన వారే పగ పెంచుకుని దారుణంగా  హత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటిదే చేశాడు ఒక నీచుడు. యువతి ప్రేమ నిరాకరించిందని తొమ్మిది మంది ప్రాణాలను బలితీసుకున్నాడు.


 యువతి కోపంతో ఇక ఆమె నివసిస్తున్న భవనానికి నిప్పు పెట్టాడు. దీంతో వివిధ ఫ్లాట్ల లో నివసిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మందికి తీవ్ర గాయాలు కావడం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగులోకి వచ్చింది.  ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుని ఎంతో సవాల్గా తీసుకున్నారు. 50 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు శుభం దీక్షిత్ అనే యువకుడే నిందితుడు అన్న విషయాన్ని తేల్చారు. పార్కింగ్ లో ఉన్న స్కూటర్ పెట్రోల్ ట్యాంక్ కు నిప్పు పెట్టడంతో ఇక ఆ మంటలు భవనమంత వ్యాపించినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో  గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: