ఇటీవలి కాలంలో ఎక్కడచూసినా దొంగల బెడద మరీ ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే  ఉద్యోగం వ్యాపారం చేసుకోవడం కంటే దొంగతనాలు చేసి అందినకాడికి దోచుకో డానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనాలు. వెరసి రోజురోజుకు దొంగతనాలు సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. అదే సమయంలో అటు పోలీసులు కూడా నిఘా పెంచారు ఎక్కడ దొంగతనాలు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇక ఎవరైనా చోరీలకు పాలు పడితే వారిని పట్టుకుంటున్నారు పోలీసులు.


 అయితే ఇప్పటి వరకు ఇలా దొంగలను పట్టుకున్న పోలీసులు మాత్రమే చూశామూ. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా దొంగల దగ్గర చోరీకి పాల్పడిన పోలీసును మాత్రం మొదటిసారి చూస్తున్నామనె చెప్పాలి. ఇటీవలే చోరీ కేసులో అరెస్టయిన నిందితుడు దగ్గర డబ్బులు కొట్టేసిన కేసులో ఇన్స్పెక్టర్ అరెస్టు చేస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోని రాచకొండ కమిషనరేట్  పరిధిలో వెలుగులోకి రావడం గమనార్హం. హర్యానా రాజస్థాన్ ప్రాంతాల్లో కొన్ని ముఠాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో టైర్లు రవాణా చేస్తున్న  కంటైనర్ ఎత్తుకెళ్లారు.


 బాధితులు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 22వ తేదీన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం గమనార్హం. అయితే ఇలా నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు వారి వద్ద ఉన్న అన్ని రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసును ఇన్స్పెక్టర్ దేవేందర్ మరింతగా పర్సనల్గా తీసుకున్నారని సమాచారం. టైర్ కొనుగోలు చేసిన బేగంబజార్ కు రిసీవర్ సెల్ ఫోన్లు బ్యాంక్ డెబిట్ కార్డు పిన్ నెంబర్లు సేకరించారు.  స్నేహితురాలి ద్వారా విడుతల వారిగా 5 లక్షల వరకు విడుదల చేయించినట్లు తెలుస్తోంది. ఇక రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన నిందితుడు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకో గా డబ్బులు ఖాళీ అయ్యాయి. దీంతో సిబ్బంది ఫిర్యాదు చేయగా పోలీసులు డబ్బు కాచేశారని అనుమానంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇన్స్పెక్టర్ దొంగతనం  బయటపడడంతో అతన్ని సస్పెండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: