ఈ మధ్య దేశంలో ఎక్కడ చూసిన డ్రగ్స్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది..ఒకవైపు ప్రభుత్వ అధికారులు వీటిని అరికట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.అయినా కూడా పోలీసుల కళ్ళు కప్పె ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.పోలీసుల దారిని మల్లించెందుకు కొత్త ప్లాను వేశారు.కానీ పోలీసుల బ్రెయిన్ ముందు వాళ్ళ ఐడియా వేస్టు అయ్యిందని చెప్పలి.


డ్రగ్ పెడ్లర్స్ తగ్గేదే లే అంటున్నారు. జైల్లో పెట్టినా.. మా దందా వదలం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. జైలుకి వెళ్లి వచ్చినా సరే.. మళ్లీ డ్రగ్స్‌తో గబ్బు వ్యాపారం చేస్తునే ఉన్నారు. రకరకాల డ్రగ్స్ దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ.. యువత భవిష్యత్‌ను చిత్తు చేస్తున్నారు కేటుగాళ్లు. ఇందు కోసం చాలా క్రియేటివ్ ఐడియాలు వాడుతున్నారు. పోలీసులకు, ఇంటిలిజెన్స్‌కు, నార్కోటిక్ బ్యూరో అధికారులకు చిక్కకుండా ఉండేందుకు.. కొత్త కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. తాజాగా సబ్బు పెట్టెల్లో హెరాయిన్ తరలించేందుకు యత్నించిన నిందితులను మణిపుర్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.


మొదట షాక్ కు గురైన పోలీసులు, వాటిని తెరచి చూసి ఖంగు తిన్నారు.వారి వద్ద నుంచి 2.13 కిలోలు విలువ చేసే డ్రగ్స్ను సీజ్ చేశారు. మొత్తం 212 సబ్బు పెట్టెల్లో నిందితులు వీటిని తరలించేందుకు ట్రై చేశారని.. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.31.80 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు.. చురచాంద్పుర్ జిల్లాకు చెందిన సోన్లైసీ హాకిప్, జామ్గౌలెన్ హాకిప్లుగా గుర్తించారు.మొన్న ఢిల్లీలో కూడా ఈ డ్రగ్స్ కేసు కలకలం రేపింది. ఏకంగా 55 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు సోదాలు చేసిన అధికారులు మరో 7కిలోలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.434 కోట్లు అని తెలిపారు. ఈ డ్రగ్స్..ఉగాండాలోని ఎంటెబ్బే నుంచి దుబాయ్ మీదుగా వీటిని ఇండియాకు తరలిస్తున్నట్లు వెల్లడించారు

మరింత సమాచారం తెలుసుకోండి: