వాడో ఇంజినీరింగ్ డ్రాపౌట్‌.. చదువు అబ్బక పోయినా దొంగ తెలివి తేటలు మాత్రం బాగానే అబ్బాయి. దీంతో సైబర్ నేరాలకు తెగబడ్డాడు. ఏకంగా కోట్ల రూపాయలకు టోకరా వేశాడు. ఇటీవల తెలంగాణ పోలీసులకు దొరికిపోయాడు. ఇలా దొరికిపోయిన హ్యాకర్ శ్రీరామ్ దినేష్ బాగోతాన్నిపోలీసులు ఇటీవల బయటపెట్టారు. ఈ శ్రీరామ్‌ ఓ ఇంజనీరింగ్ డ్రాపౌట్ విద్యార్థి. ఇతనిది మహేష్ బ్యాంక్ కేసు తహరలో  హ్యాకింగ్ కేసు. ఈ శ్రీరామ్‌ దినేష్ కుమార్ కు చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్ అంటే మోజట.


దినేష్ కంప్యూటర్లలో బగ్స్ కనిపెట్టడంలో దిట్ట అని చెబుతున్న తెలంగాణ పోలీసులు.. ఇతడు విజయవాడలో మూడు కంపెనీలు స్టార్ట్ చేశారని తెలిపారు. 2021లో బెస్ట్ పే అనే యాప్  నుంచి లక్షలు కొల్లగొట్టాడట. ఆ విషయంలో దినేష్ పై ఢిల్లీ- గుర్గావ్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కేసులు ఇండియా లో ఎవరూ పట్టుకోలేదని.. హైదరాబాద్ పోలీసులే మొదటి సారి పట్టుకున్నారని తెలిపారు. బ్యాంకు హ్యాకింగ్ చేస్తే దొరుకుతామని పేమెంట్ గేట్ వే ద్వారా 53లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారని వివరించారు.


 ఫేక్ డాకుమెంట్స్ ఇచ్చి మూడు అకౌంట్స్ లలోకి 53 లక్షలు బదిలీ చేశాడని.. ఎథికల్ హకర్స్ సేవలను మేము ఇప్పటికే  వాడుతున్నామని. వాళ్ళను మళ్ళీ ఈ కేసులో ఉపయోగించామని తెలంగాణ పోలీసులు వివరించారు. ఇప్పటికే శ్రీరామ్ నుంచి  18లక్షలు రికవరీ చేశాం.. ఇంకా అకౌంట్ నుంచి 13లక్షలు వస్తాయని తెలంగాణ పోలీసులు తెలిపారు. గడిచిన మూడు లేదా నాలుగు ఏళ్లలో 3కోట్లు బదిలీ చేసినట్లు ఒప్పుకున్నాడని.. పే జి, బెస్ట్ యాప్ వాళ్లకు నోటీసులు ఇచ్చామని.. ఆర్బీఐకి ఈ కేసులో వివరాలు ఇచ్చామని తెలంగాణ పోలీసులు  తెలిపారు.


ఈ రెండు సంస్థలది లైసెన్స్  రద్దు చేయాలని ఆర్బీఐ ని కోరుతామని.. లోన్ యాప్స్ వలలో ప్రజలు పడొద్దని తెలంగాణ పోలీసులు  సూచించారు. తెలియని యాప్స్ ఎవరూ వాడొద్దని..  యాప్స్ ల్లో చాలా చీటింగ్ యాప్స్ ఉన్నాయని తెలంగాణ పోలీసులు  హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: