దొంగలు అంటే దొచుకొని పొయ్యే వాళ్ళు మాత్రమే కాదు..కొందరు ప్రేమలను కూడా కలిగి ఉంటారని ఓ దొంగ నిరూపించాడు.. విడిపోయిన భార్యా, భర్తలను ఓ దొంగ కలిపాడు. ఇదెలా సాధ్యం అనే ఆలోచన రావడం సహజం..అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తాత్కాలికంగా విడిపోయిన భార్యభర్తలు కలవడానికి పరోక్షంగా కారణమైన సైబర్‌ నేరగాడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు..ఈ ఘటన పంజాబ్ లో వెలుగు చూసింది.


పంజాబ్‌లో ని మొహాలీ లో అరెస్టు చేసిన ఇతడిని గురువారం నగరానికి తీసుకువచ్చి కోర్టు లో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు పంపారు. వ్యక్తిగత విభేదాల నేపథ్యం లో భర్తతో దూరంగా ఉంటూ, విడాకుల ప్రయత్నాల్లో ఉన్న గృహిణికి ఫేస్‌బుక్‌ ద్వారా మొహాలీకి చెందిన పర్మేందర్‌ సింగ్‌తో పరిచయమైంది.. రెండు లక్షలు సంపాదిస్తున్నా అని ఆమెకు పెళ్ళి ప్రపొజల్ చేశాడు.ఆపై నగరానికి రాక పోకలు సాగించి ఆమె తో కొన్ని ఫొటోలు దిగాడు. రెండు సందర్భాల్లో డబ్బు అవసరమంటూ ఆమె నుంచి రూ.70 వేలు తీసుకున్నాడు.


ఓ సందర్భంలో అతడి పై అనుమానం రావడంతో ఆమె నేరుగా మొహాలీ వెళ్లారు. పర్మీందర్‌ తండ్రిని కలిసిన నేపథ్యంలో అతడో అవారా అని, కొన్ని సార్లు కీలక ఘటన లతో జైలుకు కూడా వెళ్లాడని తేలింది. దాంతో అతడిని దూరం పెట్టింది.అది సహించలేక అతను కోపాన్ని పెంచుకున్నాడు. వివాహిత తో దిగిన ఫోటోలను ఆమె, ఆమె భర్త, కుమారుడి తో పాటు వారి స్నేహితులకూ ఫేస్‌బుక్‌ ద్వారా పంపి దుష్ఫ్రచారం చేశాడు. విషయం తెలిసిన బాధితురాలి భర్త ఆమెకు మళ్లీ దగ్గరై మనో బలాన్నిచ్చాడు. ఇద్దరూ కలిసి సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణా లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.. అతన్ని అదుపులొకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: