పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అంటూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు జీవితానికి పెళ్లితోనే అసలైన అర్థం వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో యువత కూడా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని అనుకుంటూ పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు. నిజంగానే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి వయసు మీద పడితే ఇక పెళ్లి జరగడం కష్టమే అని అంటూ ఉంటారు.  పెళ్లి సంబంధాలు కుదరక ఎంతోమంది ఇబ్బందులు  పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఎంతో మంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబం కానీ ఒకటే బెంగ. అదే కొడుక్కి పెళ్లి కావడం లేదని. కొడుకు పెళ్లి కావడం లేదని తల్లి సోదరుడు ఒంటరిగా మిగిలిపోతాడు చెల్లెలు ఎంతగానో మనస్తాపం చెందారు. దీంతో క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకొని చావే శరణ్యం అని అనుకున్నారు. తాము చనిపోతే పసివాడు అనాధగా మారతాడని భావించి ముందు పసివాడి గొంతు నులిమి చంపి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనలో అమ్మమ్మ మనవడు మరణించగా బాలుడి తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.


 హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నేరేడుపల్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి లలిత దంపతులకు కొడుకు శ్రీకర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పన్నెండేళ్ల క్రితం కృష్ణ మూర్తి తో లలిత విడిపోయి పిల్లలతో నగరానికి వచ్చేసింది. ఎంతో కష్టపడి ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసింది. కాగా వినాయక నగర్ లోని ఒక అపార్ట్మెంట్లో తల్లి కుమారుడుతో కలిసి ఉంటుంది. శ్రీకర్ కు 35 ఏళ్లు దాటిన పెళ్లి కావడం లేదు. శ్రీకర్ తల్లి సోదరి మనస్తాపం చెంది.. ఏడాదిన్నర శివ కార్తికేయన్ గొంతు నులిమి చంపి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో అమ్మమ్మ మనవడు మరణించారు. దివ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: