ఈ మధ్య మ్యాట్రీమోని లో నకిలీ ఐడిలను క్రియేట్ చేసి  పెళ్ళిళ్ళు చేసుకొని ఏదొక సాకు చెప్పి చివరకు ఇంట్లోని విలువైన వస్తువులని తీసుకొనే పారి పోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాహుల్‌ పది రోజుల క్రితం లలిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బంధువుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన మూడు రోజుల తర్వాత నవ దంపతులకు బంధువులు శోభనం ఏర్పాటు చేశారు. అందంగా ముస్తాబైన వధువు పాల గ్లాసు, స్వీట్లతో గదిలోకి వెళ్లింది. తీరా శోభనానికి ముహూర్తం దగ్గర పడటంతో వాష్ రూంకు వెళ్లింది. ఆ తర్వాత బయటకు వచ్చి తనకు పీరియడ్ అని చెప్పింది.
 

అలా శోభనం ఒక వారం వాయిదా వేసింది. కుటుంబ సభ్యులతో పాటు భర్త కూడా తన ఆశలను చంపుకుని వాయిదా వేసుకున్నారు. ఆ వారం తర్వాత అందరికి కోలుకోలేని షాక్ ఇచ్చింది.అత్తగారి ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదుతోపాటు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో మూటకట్టుకుని తెల్లారేసరికి పరారీ అయింది. ఉదయం ఇంట్లో కొత్త కోడలు కనిపించకపోవడంతో అత్తమామలు అంతా వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఇంట్లో చూడగా.. నగలు, నగదు కనిపించలేదు. దీంతో మోసపోయామని గ్రహించి వెంటనే వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఫొటోలు, తెలిసిన వివరాలను అందించాడు..



ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించారు. ఈ కోణంలో నమ్మలేని విషయాలను బయట పెట్టారు.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దొంగ వధువు లలిత.. మరి కొంతమందితో ముఠాగా ఏర్పడి దొంగ వివాహాలు చేసుకుంటూ మోసం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్యాంగ్‌లోని సభ్యులే నకిలీ ఐడీలో మ్యాట్రిమోనిల్లో ఫొటోలు పెడుతూ మోసాలకు పాల్పడుతారని వెల్లడించారు.వీరంతా ఒక కుటుంబం లాగా మారి ఇలాంటి మొసాలను చేస్తున్నారని ,ఇలాంటివి నమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: