మాములుగా బిర్యాని ఒక ప్లేట్ 400 లేదా 500 ఉంటుంది. అంతకన్నా అంటే 1000 రూపాయలు ఉంటుంది. అంతేకానీ ఒకేసారి 3లక్షలు పెట్టి బిర్యానీని తినే వాళ్ళు ఎక్కడైనా ఉంటారా..ఇలాంటి విషయం గురించి ఎప్పుడైనా విన్నారా..ఇప్పుడు ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ఓ వ్యక్తి అనారొగ్య సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరారు.అయితే వాళ్ళు బిర్యానీని ఉన్న రోజులు తిన్నారు. బిల్లు కట్టే టప్పుడు ఆ విషయాన్ని గ్రహించి షాక్ అయ్యాడు.బిర్యానీ కోసం లక్షల్లో బిల్లు పెట్టడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు.


ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగు చూసింది.కత్వా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో జరిగింది. సౌవిక్ ఆలం అనే వ్యక్తి ఇటీవలే ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలనుకున్నారు. అందులో ఉన్న బిల్లును చూసి షాకయ్యారు. కాంట్రాక్టర్ బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు వెచ్చించినట్టు బిల్లు దాఖలు చేశాడు. ఈ బిల్లు కలకలం రేపింది. కింగ్‌షుక్ అనే కాంట్రాక్టర్ హాస్పటల్‌కి వివిధ రకాలైన వస్తువులను సరఫరా చేసేవాడు. ఇందులో భాగంగా ఫర్నీచర్, ఫార్మసీ, వాహనం ఖర్చుతో పాటు అనేక ఇతర బిల్లులను కలపి సుమారు రూ.3 కోట్లు పెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఎంక్వేరీ మొదలుపెట్టారు.


ఈ మేరకు అతని ఖాతాలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 80 బిల్లులు అతని అకౌంట్ లో పడ్డాయి.పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పెషల్ వెరిఫికేషన్ కమిటీ సమావేశంలో ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా నకిలీ బిల్లుల విషయాన్ని ధ్రువీకరించింది. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు. తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లకు బాధ్యులైన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు వచ్చాయి..వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: