సాధారణంగా పెళ్లి జరగాలంటే వధూ వరులు తప్పని సరిగా ఉండాల్సిందే. వధూ వరులు ఉన్నప్పటికీ తప్పక పెళ్ళి తంతు పూర్తి చేయాలి అంటే తాళిబొట్టు కూడా ఉండాలి. ఊరుకోండి బాసూ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎవరైనా మంగళ సూత్రం మరిచి పోతారా అని అంటారా.. ఇలాంటివి కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయి  అనుకుంటారు చాలా మంది. కానీ నిజ జీవితం లో కూడా ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మంగళ సూత్రం మరిచి పోయిన కారణం గా చివరికి పెళ్లి ఆగి  పోయింది.


 ఈ ఘటన సంచలనం గా మారి పోయింది. ఇక పోలీసులు కలుగజేసుకొని సర్ది చెప్పడం తో పెళ్ళి తంతు ముందుకు జరిగింది. ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఈ విచిత్రమైన ఘటన. పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన వివాహాన్ని నచ్చజెప్పి పూర్తిచేశారు పోలీసులు. ఉత్తర ప్రదేశ్లోని దెవొరియా జిల్లాలో గౌరీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోరక్ పూర్ జిల్లా వైద్య పోకరి గ్రామానికి చెందిన సంజయ్ యాదవ్.. అతిథి యాదవ్ లకు వివాహ నిశ్చితమైన సమయానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మేళతాళాలతో పెళ్లి మండపానికి వచ్చారు.


  బంధుమిత్రులు అందరు సమక్షంలో పెళ్లికి సిద్ధమైన సమయంలో పెళ్లి సడన్గా ఆగిపోయింది. దీనికి కారణం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో కట్టే మంగళసూత్రం తీసుకు రాకపోవడమే. మంగళ సూత్రం ఎందుకు తీసుకురాలేదని అడిగితే.. శకుని బాలేదని అందుకే తీసుకోలేదు అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహంతో వివాహం రద్దు చేస్తున్నట్లు పెళ్లికూతురు కుటుంబ సభ్యులు చెప్పారు.  దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇక స్థానికులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి వాళ్లకి నచ్చచెప్పారు. బంధువుల ద్వారా మంగళసూత్రం తెప్పించి ఇక పెళ్ళి జరిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: