పోలీస్ జాబ్ కొట్టాలి అన్నది ఆ యువతి కల.. ఈ క్రమంలోనే  ఎంతో మంది ఆడవాళ్లకు పోలీస్ జాబ్ ఎందుకు అంటూ వెనక్కి లాగుతున్నా ఎవరి మాట వినిపించుకోలేదు. తాను తప్పకుండా పోలీస్ ఆఫీసర్ అయ్యి తీరుతాను అంటూ బల్లగుద్ది మరీ చెప్పేది. ఇటీవలే అటు ప్రభుత్వం పోలీసు ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడంతో నిమిషం కూడా తీరిక లేకుండా అటు ఎస్సై పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది ఆ యువతి. ఈసారి తప్పకుండా పోలీస్ జాబ్ కొడతాను అంటు  ఎంతో నమ్మకంతో ఉంది.


 కానీ ఇలా పోలీస్ కావాలనే ఆ యువతి ఆశలు కలలుగానే మిగిలిపోయాయి. చివరికి కుటుంబంలో ఊహించని విషాదం నిండిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువతిని మృత్యువు కబళించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ యువతితో పాటు వెళ్లిన మరో యువకుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా  వీరభద్ర నగర్ కు చెందిన శోభకు ఇద్దరు కుమార్తెలు. గతంలో భర్త చనిపోవడంతో పెద్ద కుమార్తె శివాని ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటినుంచి  పోలీస్ కావాలనే కలగంటున్న శివాని దిల్సుఖ్నగర్ లోని ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ కానిస్టేబుల్ ఎస్ఐ పరీక్షలు రాయడానికి సన్నద్ధమవుతోంది.


 ఇటీవలే తల్లిని చూడక చాలా రోజులు కావడంతో సంగారెడ్డి బయల్దేరిన శివాని ఉదయం 11 గంటల సమయంలో దిల్సుఖ్నగర్ హాస్టల్ కి వెళ్లడానికి బయల్దేరింది. అయితే రాత్రి దాటాక తన మిత్రుడైన మహేష్ తో కలిసి బైక్పై నుంచి కూకట్పల్లి వైపు వెళ్తుండగా భాగ్యనగర్ కాలనీ లో పిల్లర్ నెంబర్ 765 వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన లారి బైకును ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై పడి ఉన్న ఆమెకు కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. మహేష్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: