కొన్ని విషాదకర ఘటనలూ చూసిన తర్వాత విధి ఎంత విచిత్రమైనది అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏకంగా పుట్టినరోజు నాడు ఎంతో సంతోషంగా ఉన్నాము అనుకుంటున్న సమయంలోనే ఊహించని విధంగా మృత్యువు కబళిస్తూ ఉంటుంది. చివరికి పుట్టినరోజు వేడుకలు జరపడానికి సిద్ధంగా ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా విషాదంలోకి నెడుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పుట్టినరోజు కావడంతో ఆమె ఎంతో సంతోషంగా ఇంట్లో ముస్తాబై సెల్ ఫోన్లో ఫోటో దిగింది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రికి తమ్ముడికి బర్త్ డే పార్టీ ఇస్తాను అని చెప్పి వెళ్ళింది.


 అయితే ఇలా డ్యూటీ కి వెళ్తున్నాను అంటూ చెప్పి వెళ్లిన కాసేపటికి ఊహించని ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు నాడే ఆమెను మృత్యువు కబళించింది. ఎంఎంటీఎస్ రైలు వేగం ధాటికి ఎగిరి పడిన మహిళలు చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన లావణ్య తండ్రి సోదరులు ఇద్దరు కూతుళ్లతో కలిసి కొన్నాళ్ల క్రితం హైదరాబాదు నగరానికి వచ్చారు.


 ప్రస్తుతం తుమ్మ బస్తీలో నివాసముంటున్నారు వీరు. కాగా లావణ్య ఖైరతాబాద్లో టెలీకాలర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే రోజు లాగానే బుధవారం సమయంలో తుమ్మల బస్తి నుంచి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటి ఖైరతాబాద్ వచ్చే క్రమంలో హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే ఎంఎంటీఎస్ రైలు స్పీడుడుకు ఒక్కసారిగా ఎగిరి పడింది లావణ్య. ఈ క్రమంలోనే తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇలా పుట్టిన రోజు నాడే లావణ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: