పెళ్ళి వయస్సు వస్తే చాలా మంది ఎన్నెన్నో కలలను కంటారు..తమను చేసుకోబోయేవాల్లు ఎలా ఉంటారు.ఎలా చూసుకుంటారు. అనే ఆలోచనలు అందరికి రావడం సహజం..అయితే పెళ్ళి పీటలు వరకూ వస్తేనే అవి జరుగుతాయో లేదో గ్యారెంటీ లేదు..కొన్ని ఇంకేదో విషయాల వల్ల, వర కట్నం వల్లనో ఆగి పోవడం చూసే ఉంటాము..తాజాగా మరో ఘటన వెలుగులోకి అడిగిన కట్నం ఇచ్చిన కూడా పెళ్ళికి రాలేదు. చివరికి మరింత కట్నం కావాలని లేకుంటే మండపానికి రామని తెగెసి చెప్పెస్తారు.. దాంతో షాక్ అయిన వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించారు.తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో పెళ్ళి కొడుకు పై విమర్శలు వెలువెత్తున్నాయి.వివరాల్లొకి వెళితే..ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.షహరాన్ పూర్‌కు చెందిన షబానా అనే యువతికి ఏడాది క్రితం షాదిక్ అనే యువకుడితో నిశ్ఛితార్థం జరిగింది. ఈ నెల 15వ తేదీన పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. వరుడికి ఇవ్వాల్సిన కట్నం, బైక్, ఇతర వస్తువులు రెండ్రోజుల ముందే ఇచ్చేశారు. 15వ తేదీన జరగాల్సిన పెళ్లి కోసం రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా ఏర్పాట్లు చేశారు. వరుడి కుటుంబాన్ని పెళ్లి రోజు ఉదయం 9.30 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అన్ని ఏర్పాట్లూ చేసుకుని వారి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అయితే ఎంత సేపటికీ వరుడి కుటుంబ సభ్యులు కల్యాణ మండపానికి రాలేదు.



దాంతో అమ్మాయి తండ్రి అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి అడగగా..వాళ్ళు చెప్పిన విషయం విని షాక్ అయ్యారు. తమకు అదనంగా రూ.10 లక్షల కట్నం, స్విఫ్ట్ కారు ఇస్తేనే కల్యాణ మండపంలో అడుగు పెడతామని వరుడి తండ్రి తేల్చిచెప్పాడు. దీంతో వధువు తరఫు వారందరూ షాకయ్యారు. వధువుతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరకు వధువు తండ్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వరుడి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయమని వేడుకున్నారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: