సాధారణంగా పెళ్లి సమయంలో కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే అన్న విషయం తెలిసిందే. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు కూడా. అయితే అందరికి అన్నీ తెలుసు కానీ నేటి రోజుల్లో ఎవరిని అడిగినా కట్నం లేకుండా పెళ్ళి జరగడం అసాధ్యం అని చెబుతూ ఉంటారు  కట్నకానుకలు ఉంటేనే ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు  ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు కూతుర్ని పెళ్ళి చేసుకోబోయే వారికి భారీగా కట్నకానుకలు ముట్ట చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.



 అయితే నేటి రోజుల్లో నాకు కట్నం వద్దు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అని అనేవారు సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక యువకుడు కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతను చదువుకున్నాడు కాబట్టి ఆదర్శంగా ఆలోచించాడు. కానీ అతని తల్లిదండ్రులు అంత గొప్ప ఆలోచించాల్సిన అవసరం లేదు.  కొడుకుకి కట్న కానుకలు భారీగా పెట్టాలి అంటు అమ్మాయి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. అయితే ఈ విషయం ఆ యువకుడికి అస్సలు నచ్చలేదు. దీంతో ఏకంగా తల్లిదండ్రులకు షాక్ ఇచ్చాడు సదరు యువకుడు.


 పేరెంట్స్ కారణంగా తరచూ పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది అని భావించిన యువకుడు యోగేష్ చివరికి సొంత తల్లిదండ్రుల పైన ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో జరిగింది. సదరు యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి తో పెళ్లికి ఓకే చెప్పారు. కానీ వధువు నుంచి భారీగా కట్నం కావాలి అంటూ  కోరారు. కానీ వారు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అని తెలిసిన అటు వారి కుటుంబ సభ్యులు మాత్రం పట్టు విడవకుండా ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పెళ్లి వాయిదా పడుతుందని విసుగుచెందిన వరుడు చివరికి తల్లిదండ్రులు పైన ఫిర్యాదు చేశాడు. కల్పించుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: