డబ్బులు కోసం అమ్మాయిలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు..అందులో కొన్ని దారుణాలకు కూడా దిగుతున్నారు..ఈజిగా ఉండే మార్గాలను ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.అందులో వరుస పెళ్ళిళ్ళు చేసుకోవడం, అందిన కాడికి డబ్బులను దండుకోవడం చివరికి అడ్రెస్ మారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు పోలీసులకు పెద్ద టార్గెట్ అవుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్‌ లోని జబల్‌పూర్‌ లో ఈ దొంగ పెళ్లికూతురును అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలిశాయి.


చాలాకాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారిని ఎంచుకొని, వారే లక్ష్యంగా మోసాలు చేస్తోందని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ చంద్ర భట్‌ అనే వ్యక్తికి గతేడాది వివాహం జరిగింది. ఓ పెళ్లిళ్ల ఏజెంట్ అతనికి రీనా ఠాకూర్ అనే యువతితో పెళ్లి జరిపించాడు. పెళ్లిని సెట్ చేసినందుకు అతడు వరుడి నుంచి 5 లక్షలు తీసుకున్నాడు.పెళ్లయిన వారం రోజుల పాటు అత్తింట్లో ఉన్న రీనా ఆ తర్వాత ప్రకాశ్ చంద్రతో కలిసి జబల్‌పూర్‌కు వెళ్లింది. అక్కడి నుంచి మళ్లీ తిరిగి వస్తుండగా ప్రకాశ్ చంద్రపై దాడి చేయించింది..



ఆ తర్వాత తన గ్యాంగ్ తో అక్కడ నుంచి చెక్కెసింది.జబల్‌పూర్‌కు చెందిన పూజా బర్మన్ అనే వ్యక్తి ఈ నకిలీ పెళ్లిళ్ల ముఠాను నడుపుతున్నట్లు గుర్తించారు. నకిలీ పేర్లు, కొంతమంది అమ్మాయిల చిరునామాలు, ఆధార్ కార్డులు, ఇతర ధృవపత్రాలు తయారు చేసి, ఏజెంట్ల సహాయంతో నకిలీ పెళ్లిళ్లు చేయిస్తున్నాడని గుర్తించారు. అనంతరం వారి నుంచి డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు దోచుకొని పారిపోతున్నారని పోలీసులు తెలిపారు.వీరి చేతిలో చాలా మంది అబ్బాయిలు మోస పొయారని తెలిపారు..కొందరు యువకుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్థాన్‌లో ఓ నిత్య పెళ్లికూతురు పోలీసులకు పట్టుబడింది. ఇప్పటి వరకు 30 పెళ్లిళ్లు చేసుకొని, 31వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న మహిళతో పాటు మరికొందరిని రాజ్థాన్‌ పోలీసులు పట్టుకున్నారు..ఆమె చేతిలో మోస పోయిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: