ఇటీవల కాలం లో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎంతలా పెరిగిపోతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని అటు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ వినకపోతే ఇక రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానా కూడా విధిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా జరిమానాలు విధిస్తున్న సమయంలో  ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నారు తప్ప ట్రాఫిక్ రూల్స్ పాటించి తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచన మాత్రం ఎవరూ చేయడం లేదు.


 ముఖ్యం గా ద్విచక్ర వాహనం  పై వెళ్తున్న వారు వివిధ కారణాలు చెబుతూ హెల్మెట్ పెట్టుకోకుండానే డ్రైవ్ చేస్తున్నారు. చివరికి రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి  కొంతమంది హెల్మెట్ ధరించినా కాస్త నిర్లక్ష్యంగా హెల్మెట్ పట్టి పెట్టుకోకుండా ఉంటున్నారు. తద్వారా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇక తల మీద నుంచి హెల్మెట్ ఎగిరి కింద పడిపోతుంది.దీంతో హెల్మెట్ పెట్టుకున్న ఉపయోగం ఉండడం లేదు.


 దీంతో ఇక దేశం లో రోడ్డు ప్రమాదాలు మరణాల సంఖ్య తగ్గించేందుకు కేంద్రం కఠిన నిబంధనలు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక నుంచి హెల్మెట్ ధరించినా కూడా 2 వేల జరిమానా విధించేలా చట్టం లో సవరణలు చేసింది   హెల్మెట్ ధరించి నిర్లక్ష్యం గా పట్టి పెట్టు కోకపోతే 1000 రూపాయలు.. బి ఐ ఎస్ గుర్తింపు లేకపోతే మరో వెయ్యి రూపాయలు జరిమానా విధించపోతున్నారు. ఇక ఈ రెండు నిబంధనలు పాటించక పోతే చట్టప్రకారం జరిమానా తో పాటు ఒక మూడు నెలలు లైసెన్స్ రద్దు చేయనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: