మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అందుకే మృత్యువు ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది  ఊహకందని విధంగా ఉంటుంది. అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో చిన్న సంఘటనలు కొన్ని సార్లు ప్రాణాలు తీసేస్తూ ఉంటాయి. దీంతో ఎన్నో కుటుంబాలు శోకసముద్రంలో మునిగి పోతుంటాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగానే ఆడుకున్నాడు బాలుడు అంతలో దాహం వేయడంతో చివరికి ఒక బాటిల్ మూత నోటితో తీసేందుకు ప్రయత్నించాడు. చివరికి బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని బాలుడు కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు.


 ఈ ఘటనతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ అయ్యారు.  కాసేపటివరకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. చివరికి ఇక తమ కొడుకు కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు అని తెలిసి అరణ్యరోదనగా విలపించారు. ఈ విషాదకర ఘటన హర్యానా రాష్ట్రంలోని అంబాలా లో జరిగింది. అంబాలా కంటోన్మెంట్ లోని డిఫెన్స్ కాలనీ లో తల్లిదండ్రులతో కలిసి న15 ఏళ్ళ బాలుడు యష్ ఉంటున్నాడు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో దప్పిక తీర్చుకునేందుకు కూల్ డ్రింక్ లు   తాగుతూ ఉన్నారు అందరూ. ఈ క్రమంలోనే  తమ కొడుకు కోసం తల్లిదండ్రులు ఫ్రిజ్ లో కూల్ డ్రింకులు  పెట్టారు.


 ఇటీవలే దాహం వేయడం తో కూల్ డ్రింక్ తాగేందుకు మూత తెరిచేందుకు ప్రయత్నించాడు యష్. చేతితో కాకుండా నోటితో తీశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా తెరుచుకున్న క్యాప్ గొంతులోకి వెళ్ళింది. శ్వాస నాళానికి అడ్డుపడింది. చూస్తూ చూస్తుండగానే ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. ఇక మూతను గొంతులో నుంచి బయటకు తీసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించినా కుదరలేదు. స్థానిక ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: