కొంతమంది సరదాగా కొన్ని రకాల చిలిపి పనులు చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా ఆనందం పొందుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రమే ఇలా సరదాగా చేసిన పనులే ఎంతో మంది ప్రాణాల మీదికి తెస్తూ ఉంటాయి  ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణం గా పెళ్లి తర్వాత బరాత్ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. డీజే పాటలు బ్యాండ్ చప్పుళ్ళ మధ్య బంధుమిత్రులు అందరు కూడా డాన్సులు చేస్తూ ఉంటే నూతన వధూవరులు ఇద్దరూ కూడా కారులో కూర్చుని ఎంతో ఆనంద పడిపోతూ వుంటారూ.


 ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేయబడిన వేదికపై నూతన వధూవరులకు పెళ్లి జరిగింది. ఇక పెళ్లి తర్వాత బరాత్ కూడా అంతే ఘనంగా జరిగాలి కదా. అనుకున్నట్లుగానే డీజే పాటలు మధ్య బంధుమిత్రులు అందరు డాన్స్ చేస్తూ ఉంటే ఘనంగా జరుగుతోంది. అలాంటి సమయంలోనే కార్లో కూర్చొని కారు ముందు మందులు డాన్స్ చేస్తుంటే చూసి ఆనంద పడాల్సిన పెళ్లి కొడుకుకు ఒక ఆలోచన వచ్చింది. ఒకసారి కార్ నడిపితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. అయితే అతనికి కార్ డ్రైవింగ్ రాక పోవడం గమనార్హం. చివరికీ డ్రైవింగ్ రాకుండా కారు నడిపి ఒకరి ప్రాణం పోవడానికి కారణం అయ్యాడు.


 డాన్స్ చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒక బాలుడు దుర్మరణం పాలైన ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుపల్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గట్టుపల్ కు చెందిన మల్లేష్ వివాహం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో జరిగింది. అయితే అదే రోజు రాత్రి వధువుతో కలిసి స్వగ్రామానికి కారులో రాగా డీజే పాటలతో బరాత్ ఏర్పాటు చేశారు. వరుడు ఇల్లు కొంత దూరం ఉండగా వధూవరులు.. కారులోంచి దిగి బంధువులతో కలిసి డాన్స్ చేశారు. ఇక మళ్ళీ తర్వాత కారులో ఎక్కగా.. ఆ సమయంలో కారు డ్రైవర్ లేకపోవడంతో డ్రైవింగ్ లేకపోయినా కారు నడిపేందుకు ప్రయత్నించాడు వరుడు. దీంతో కారు ముందు డాన్స్ చేస్తున్న వారిపై కి దూసుకెళ్లింది. దీంతో బాలుడు  మరణించగా పెళ్లి కొడుకు పై కేసు నమోదైంది..

మరింత సమాచారం తెలుసుకోండి: