పెళ్ళంటే నూరేళ్ళ పంట అని చెబుతూ ఉంటారు పెద్దలు. అందుకే తొందర పడి పెళ్లి చేసుకోకుండా మనసుకు నచ్చిన.. అర్థం చేసుకునే అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాలని అంటూ ఉంటారు. అంతే కాదు ఇక జీవితంలో వెళ్లి బంధం ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి బంధుమిత్రులందరికీ సమక్షంలో చేసుకోవడం మంచిది అని అంటూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో పెళ్లి అనే కాన్సెప్ట్ ను కూడా కమర్షియల్గా వాడుకుంటున్నారు ఎంతోమంది. ఇక మంచి ఉద్యోగం సాధిస్తే మంచి కట్నకానుకలు వస్తాయని కాస్త ఆలస్యంగా పెళ్లి చేసుకోడానికి ఇష్టపడుతున్నారు. ఇంకొంతమంది కట్నం కోసం ఏకంగా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్న  ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 24 గంటలు గడవక ముందే నన్ను అతను మోసం చేశాడంటూ యువతి అతని ఇంటి ముందు నిరసన తెలిపింది. ఇలా పెళ్లి బాజాలు మోగిన ఇంటిముందు ఓ యువతి నిరసనకు దిగిన ఘటన హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడ వెలుగులోకి వచ్చి సంచలన గా మారిపోయింది. వివరాల్లోకి వెళితే.. వెంకట్ రెడ్డి నగర్ కు చెందిన శ్రీకాంతచారి తాను పదిహేనేళ్లుగా ప్రేమించుకుంటున్నామూ అంటూ రామంతాపూర్ కు చెందిన లక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి తెలిపింది. ఇక తననే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం తనను కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు అంటూ వాపోయింది.


 ఇలా ప్రేమ పేరిట నమ్మించి మోసం చేసి మరొక వివాహం చేసుకున్న శ్రీకాంతచారి పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం. దీంతో బాధితురాలు నిందితుడు ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. ఇక సదరు బాధితురాలికి ఆదర్శ మహిళా సంఘం సభ్యులు మద్దతు తెలపడం గమనార్హం. చివరికి ఇక ఈ స్టోరీ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. లక్ష్మి కి న్యాయం జరిగేంత వరకూ పోరాటం ఆపేది లేదని మహిళా కమిషన్ సభ్యులు చెబుతుండడం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: