ఇటీవలి కాలం లో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కోర్టులు కఠిన శిక్షలు విధించినా కామాంధు లలో మాత్రం మార్పు రావడం లేదు. మంచి వాళ్ళలా ప్రవర్తిస్తున్న ఎంతోమంది సమయం సందర్భం చూసి దారుణం గా అత్యాచారానికి పాల్పడినలు ఘటన కోకొల్లలుగా వెలుగు లోకి వస్తున్నాయ్. ఇలాంటి ఘటనలు ఆడపిల్లల భద్రతను  రోజు రోజుకు ప్రశ్నార్థకం గానే మార్చేస్తున్నాయ్ అన్నది అర్ధమవుతుంది. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఏ క్షణం లో ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేటి రోజుల్లో.



 కనీసం తమ పిల్లలను చదువు కోవడానికి పంపించడానికి కూడా భయపడి పోతున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు. ఇక్కడ ఇలాంటి ఒక ఘటన జరిగింది. చదువుకునేందుకు వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న ఒక విద్యార్థినిపై కరస్పాండెంట్ పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన కాకినాడ నగరం లో వెలుగు లోకి వచ్చింది. నగరానికి చెందిన పదిహేనేళ్ల బాలిక ఆరో తరగతి నుంచి కొండయ్య పాలెం లోనే హెల్పింగ్ హాండ్స్ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటుంది. తండ్రి చనిపోవడంతో ఇంకా తనే అన్ని బాగోగులు చూసుకుంటుంది.


 ఇటీవలే 9వ తరగతి పరీక్షలు రాసింది ఆ బాలిక. వసతి గృహంలో కరస్పాండెంట్ గా ఉన్న విజయ్ కుమార్ అనే 60 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గదిలోకి తీసుకెళ్ళి కరోనా మాత్రలు అని చెప్పి మత్తు మందు ఇచ్చి చివరికి అత్యాచారం చేశాడు. ఇక ఇటీవల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయాన్ని పోలీసుల ముందు వెల్లడించింది బాలిక. మూడు నెలలుగా తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండడంతో ఏం జరిగింది అని తల్లి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. గర్భస్రావం అయినట్టు వైద్యులు తెలిపారు.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: