అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో విధి కొన్ని కొన్ని సార్లు ఊహించని విషాదాన్ని నింపుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అనుకోని ప్రమాదాల కారణంగా ఎంతోమంది చివరికి ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. వాళ్ళిద్దరు ఒకరంటే ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల పాటు సహజీవనం కూడా చేశారు. ఇక ఎంతో కష్టపడి కుటుంబ సభ్యులను ఒప్పించి సంతోషంగా వివాహం చేసుకున్నారు. ఇక అంతా సంతోషంగా జరిగిపోయింది. కానీ అంతలోనే వారి జీవితాలు ముగిసిపోయాయి. పెళ్ళై తిరిగి వస్తున్న సమయంలో కంటైనర్ మృత్యువు రూపంలో కబళించింది.


 ఈ ఘటనలో  వరుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన ఎల్.ఎన్.పేట మండలం పెద్ద కొల్లివలస గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పవన్ కుమార్ తాపీ మేస్త్రీగా పని చేస్తూ ఉన్నాడు. శ్యామల పురం గ్రామానికి చెందిన యోగేశ్వరి తో అతనికి పరిచయం ఏర్పడగా.. పరిచయం ప్రేమగా మారింది. ఇటీవలే పెద్దలను ఎదిరించి మరీ గ్రామానికి తీసుకు వచ్చి ఆమెతో కలిసి ఉంటున్నాడు.  పెద్దలను రాజీ కుదిర్చి ఇటీవల పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఇద్దరు యువతీ యువకులు.  పెద్దల సమక్షంలో ఇటీవల వివాహం జరిగింది.


 వివాహం జరిగిన తర్వాత ఉదయం పెళ్లి కుమార్తే తో పాటు తల్లిదండ్రులు బంధువులు విశాఖపట్నంలో బస్సు ఎక్కారు. ఇక మావయ్య సోమేశ్వరరావు తో కలిసి పవన్ కుమార్ స్వగ్రామం వచ్చేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్దకు రాగానే చివరికి కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో పవన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా సోమేశ్వరరావు తీవ్ర గాయాలయ్యాయి. ఇలా పెళ్లి అయిన మరుసటి రోజే వరుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా ఈ ప్రేమజంట పెద్దలను  ఎదిరించిన చివరికి విధి చేతిలో ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: